Tally Prime సాఫ్ట్వేర్ లో యూస్ చేయని ఐటమ్స్ ఎలా డిలీట్ చేయాలి అని మనం ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్ లో మనం Tally Prime సాఫ్ట్వేర్ లో యూస్ చేయని Item Ledger ఎలా డిలీట్ చేయాలి అని తెలుసుకుందాం.
ఒక company లో మనం ఏమైనా Delete చేయాలి అనుకుంటే Compulsory ముందుగా Additional Backup తీసి పెట్టుకోవాలి.
ప్రతి సంవత్సరం మనం కొన్ని party ‘s తో జరిగిన Transactions జరిగినప్పుడు మరియు Splitting చేసినప్పుడు కొన్ని use చేయని Ledgers ఉంటాయి.ఇలాంటి Ledgers ని ఎలా Delete చేయాలో తెలుసుకుందాం. Organization లో కానీ company లో కానీ No .of operators ఉన్నప్పుడు Spelling Mistakes వల్ల కానీ లేదంటే Details correct గా enter చేయకపోవడం వల్ల కానీ కొన్ని No .of Ledgers Create అవ్వడం జరుగుతుంది. ఈ No .of Ledgers count పెరగడం వల్ల Bill Entry చేసేటప్పుడు లేదా ఏదయినా Item Register చూడాలి అనుకున్నప్పుడు confusion వస్తుంది. ఈ confusion ని అధిగమించడానికి మనం Unused Ledger Masters ని Delete చేయాలి.ఇలా Delete చేయడం ద్వారా మనం Company Performance పెరిగి Speed గా Operate చేస్కోవచ్చు.
ఈ Unused Ledger Masters ని Delete చేయడానికి Gateway of Tally లో కింద చూపిన విధంగా CHart of Accounts సెలెక్ట్ చేయాలి.
CHart of Accounts లో కింద చూపిన విధంగా Ledgers సెలెక్ట్ చేసుకోవాలి.
కింద చూపిన విధంగా Ledgers List open అవుతుంది.
ఇక్కడ right side లో గమనించండి option J : Exception Reports అని ఉంది కదా J కింద double లైన్ ఉంది కాబట్టి Ctrl +J ప్రెస్ చేయాలి.
Ctrl +J ప్రెస్ చేసాక కింద చూపిన విధంగా Show Unused సెలెక్ట్ చేసుకోవాలి.
Show Unused సెలెక్ట్ చేసాక కింద చూపిన విధంగా List of Ledgers (Unused ) open అవుతుంది. ఇక్కడ కింద గమనించండి మనకి Total గా ఎన్ని Unused Ledgers ఉన్నాయో count కూడా చూడొచ్చు Total 23 Unused Ledgers ఉన్నాయ్.
ఈ List ని మనం Delete చేయాలి అనుకుంటున్నాం కాబట్టి అన్ని ఒకేసారి సెలెక్ట్ చేయడానికి Ctrl +Space Shortcut Key ని ప్రెస్ చేయాలి.
అన్ని సెలెక్ట్ చేసుకున్నాక Alt +D ప్రెస్ చేయాలి. Alt +D ప్రెస్ చేసాక కింద చూపిన విధంగా Delete Selected ? అని అడుగుతుంది Yes ప్రెస్ చేయాలి.
Yes ప్రెస్ చేసాక కింద గమనించండి unused Ledgers list delete అయిపోయింది.
ఈ Unused Ledger Masters ని మనం కొన్ని situations లో మాత్రం Delete చేసుకోలేము అవేంటో చూద్దాం.
- One / more Transactions లో ఆ Particular Ledger ఉన్నట్లయితే ఆ Ledger ని Delete చేయలేము.
- ఆ Particular Ledger కి సంబంధించిన Cause centers కనుక Enable చేసి ఉంటే ఆ Ledger ని Delete చేయలేము.
- Cause centers Transactions ఆ Particular Ledger లో ఉన్నా కూడా ఆ Ledger ని Delete చేయలేము.
- ఆ Particular Ledger Voucher లో Opening Balance ఉంటే Unused Ledger లిస్టులో ఆ Ledger కనపడదు.
- ఆ Particular Ledger క్లాస్ లో Allocation situation ఉన్నప్పుడు కూడా ఆ Ledger ని Delete చేయడం కుదరదు .
ఈ విధంగా మనం Tally Prime సాఫ్ట్వేర్ లో యూస్ చేయని Item Ledger ఎలా డిలీట్ చేయాలి అని తెలుసుకున్నాం కదా .
ఇలాంటి Tally Prime కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి, Tally Prime సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.
ఇలాంటి ట్యుటోరియల్స్ ఇంకా కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.