MARG సాఫ్ట్వేర్ లో అయ్యే కీబోర్డ్ షార్ట్ కట్స్ (Shortcut Keys) గురించి మనం ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్ లో మనం Marg ERP సాఫ్ట్వేర్ లో HSN మాస్టర్స్ ఎలా క్రియేట్ చేయాలి అని తెలుసుకుందాం.
HSN / SAC Master అనే దాని మీద క్లిక్ చేయగానే మనకి క్రింద ఇమేజ్ లో లాగా కనిపిస్తుంది. ఇమేజ్ లో లెఫ్ట్ సైడ్ లో ఉన్న చిన్న డైలాగ్ బాక్స్ లో చూస్తే షార్ట్ కట్ కీస్ ఇన్ఫర్మేషన్ ఇలా ఉంటుంది.
F2-Create New, F3-Modify, Del-Delete : మనం న్యూగా HSN కోడ్ క్రియేట్ చేయాలి అంటే F2 అని ఆల్రెడీ చేసిన దానిలో ఏమైనా చేంజెస్ చేయాలి అంటే F3 అని కోడ్ తప్పుగా ఏమైనా క్రియేట్ చేస్తే డిలీట్ చేయాలి అంటే Del అనే షార్ట్ కట్స్ యూస్ చేయాలి.
Turnover 1.5 to 5 Crore, HSN Code in 2 Character: 1.5 Crore వరకు అంటే కోటిన్నర టర్నోవర్ వరకు HSN కోడ్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. టర్నోవర్ 1.5 కోట్ల నుండి 5 కోట్ల వరకు ఉంటే HSN కోడ్ తప్పనిసరిగా 2 కేరక్టర్స్ అయిన క్రియేట్ చేయాలి.
మనం ఇప్పుడు న్యూ గా HSN కోడ్ క్రియేట్ చేయడం కోసం F2 క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే ఈ క్రింది ఇమేజ్ లో లాగా వస్తుంది.
పైన ఇమేజ్ లో చూస్తే మనకి HSN / SAC detail అనే బాక్స్ కనిపిస్తుంది. అందులో HSN అనేది గూడ్స్ కి యూస్ చేస్తాము, SAC అనేది సర్వీసెస్ కి యూస్ చేస్తాము.
HSN / SAC దగ్గర Code enter చేయాలి. short Name దగ్గర మనం ఏ products కి సంబంధించిన HSN క్రీస్తే చేస్తున్నామో అది పైన ఇమేజ్ లో చూపిన విధంగా enter చేయాలి.
ఇక్కడ IGST 5% కాబట్టి SGST దగ్గర 2.5, CGST దగ్గర 2.5, IGST దగ్గర పైన ఇమేజ్ లో చూపిన విధంగా ఆటోమేటిక్ గా 5% అని వస్తుంది. Type దగ్గర Goods అని UQC దగ్గర PCS అని ఎంటర్ చేయాలి. UQC అంటే Unique Quantity Code. దీనిని గవర్నమెంట్ వాళ్ళు ముందుగానే డిఫైన్ చేశారు. EX: pieces, boxes, cases,kgs ,No .s . ఇలా అన్నమాట. అంటే మనం ఎంటర్ చేస్తున్న HSN యొక్క ప్రొడక్ట్ మెజర్మెంట్ UQC. ఇవన్నీ ఎంటర్ చేస్తే మనకి క్రింద ఇమేజ్ లో లాగా ఉంటుంది. అంతే మనం ఒక HSN కోడ్ క్రియేట్ చేసేసాము.
ఇలానే మనం Example గా 3 different HSN మాస్టర్స్ ని Create చేసి చూద్దాం .ఈ క్రింది ఇమేజ్ లో చూడండి .
HSN 1234 IGST 12% అనుకుంటున్నాను కాబట్టి SGST దగ్గర 6, CGST దగ్గర 6, IGST దగ్గర పైన ఇమేజ్ లో చూపిన విధంగా ఆటోమేటిక్ గా12% అని వస్తుంది. Type దగ్గర Goods అని UQC దగ్గర NOS అని ఎంటర్ చేసాం.
HSN 2345 IGST 18% అనుకుంటున్నాను కాబట్టి SGST దగ్గర 9, CGST దగ్గర 9, IGST దగ్గర పైన ఇమేజ్ లో చూపిన విధంగా ఆటోమేటిక్ గా18% అని వస్తుంది. Type దగ్గర Goods అని UQC దగ్గర KGS అని ఎంటర్ చేసాం.
HSN 2345 IGST 28% అనుకుంటున్నాను కాబట్టి SGST దగ్గర 14, CGST దగ్గర 14, IGST దగ్గర పైన ఇమేజ్ లో చూపిన విధంగా ఆటోమేటిక్ గా 28% అని వస్తుంది. Type దగ్గర Goods అని UQC దగ్గర PACK అని ఎంటర్ చేసాం. ఇలా మనం ఎన్ని HSN మాస్టర్స్ అయినా సులభంగా క్రియేట్ చేసుకోవచ్చు.
ఈ విధంగా మనం Marg ERP సాఫ్ట్వేర్ లో ఎలా HSN మాస్టర్స్ ఎలా క్రియేట్ చేయాలి అని తెలుసుకున్నాం కదా.
ఇలాంటి Marg సాఫ్ట్వేర్ కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి, Marg సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.
ఇలాంటి ట్యుటోరియల్స్ ఇంకా కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.