How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu

ఈ ఆర్టికల్ లో మనం GSTR-1 రిపోర్ట్ Tally Prime లో ఎలా Export చేయాలి అని తెలుసుకుందాం.

Tally Prime లో మనం GSTR-1 రిపోర్ట్ ను రెండు విధాలుగా ఓపెన్ చేయొచ్చు.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 1

ఫస్ట్ Method Gateway of Tally > Display More Reports > GST Reports >GSTR-1 సెలెక్ట్ చేయాలి.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 2

GSTR-1 సెలెక్ట్ చేసాక కింద చూపిన విధంగా Report ఓపెన్ అవుతుంది.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 3

పైన గమనించండి Rightside లో F2: Period అని ఉంది కదా F2 ప్రెస్ చేయాలి.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 4

F2 ప్రెస్ చేసాక పైన చూపిన విధంగా మనం ఏ particular Period (ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు ) ఎంటర్ చేయాలి.

సెకండ్ Method ఏంటంటే Gateway of Tally లో Alt + G ప్రెస్ చేయాలి. Alt + G అంటే Go To కి షార్ట్ కట్ కీ. Alt + G ప్రెస్ చేస్తే క్రింది విధంగా GO TO డైలాగ్ బాక్స్ వస్తుంది.
GO TO డైలాగ్ బాక్స్ లో GSTR అని type చేయగానే డ్రాప్ డౌన్ ఆప్షన్స్ లో GSTR-1 అని వస్తుంది దాన్నిసెలెక్ట్ చేసుకోవాలి. ( క్రింది ఇమేజ్ చూడండి )

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 5

GSTR-1 సెలెక్ట్ చేసాక F2 ప్రెస్ చేసి కింద చూపిన విధంగా మనం ఏ particular Period (ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు ) ఎంటర్ చేయాలి.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 6

చూసారుగా ప్రీవియస్ గా  మనం ఓపెన్ చేసిన రిపోర్ట్ కింద చూపిన  Report ఒకటే. ఇది డిఫాల్ట్ వచ్చే Report. GSTR-1 Report ను 3 Formats (EXCEL ,JSON ,CSV )లో download చేసుకోవచ్చు.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 6-1

ఈ Report ను Auditor కి పంపడానికి ముందుగా  మనం ఈ  Report ను Configure చేసుకోవాలి ఎందుకంటే ఈ డిఫాల్ట్ గా వచ్చే Report లో Taxable Amount మరియు  Tax Amount (CGST ,IGST ,SGST ) రావట్లేదు. ఇది రావాలంటే F 12 Cofiguration ప్రెస్ చేయాలి.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 7

F 12ప్రెస్ చేసాక పైన చూపిన విధంగా Cofiguration Dialogue Box ఓపెన్ అవుతుంది.

ఇందులో కింద చూపిన విధంగా Show Tax types in separate columns దగ్గర డిఫాల్ట్ గా  No అని ఉంది yes అని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే Format of Report దగ్గర Detailed అని సెలెక్ట్ చేసుకోవాలి.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 8

Configure చేసాక కింద ఇమేజ్ లో గమనించండి Detailed Report ఇక్కడ చూడొచ్చు.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 9

ఈ Detailed Report లో కింద చూపిన విధంగా HSNSAC Summary సెలెక్ట్ చేసి Enter Key ప్రెస్ చేయాలి.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 10

కింద చూపిన విధంగా HSN/SAC Summary  ఓపెన్ అవుతుంది.ఇక్కడ గమనించండి Incomplete Information in HSN/SAC Summary(Corrections Needed ) కౌంట్ ఎప్పుడైనా compulsory Zero గా ఉండాలి లేదంటే మనం GSTR-1 ఫైల్ చేయలేము.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 11

Tally ERP9 లో 6.63 వరకు  HSN/SAC Summary Export చేద్దామంటే Tax తో పాటుగా  Export కావట్లేదు. Tally Prime ఉపయోగించడం వల్ల benefit ఏంటి అంటే మనం HSN/SAC Summary ని Tax తో సహా Export  చేసుకోవచ్చు.కాబట్టి ప్రతి ఒక్కరు Tally Prime కి update చేసుకోవాలి.అందుకోసం Guptha accunting Solutions ను సంప్రదించండి. ఇక్కడ Updation  తో పాటు  Training కూడా పొందవచ్చు.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 12

పైన ఇమేజ్ లో గమనించండి ఈ GSTR-1 report లో Total గా 392 Vouchers ఉన్నాయ్. ఒక్కసారి Total Vouchers సెలెక్ట్ చేసి Enter Key ప్రెస్చేసి చూద్దాం .

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 13

Enter Key ప్రెస్ చేసాక మనకి పైన చూపిన విధంగా ఓపెన్ అవుతుంది. GSTR-1 Report అంటేనే Sales కి సంబంధించింది కాబట్టి మనం ఈ option compulsory గా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 14

పైన ఇమేజ్ లో చూడండి Sales Total 96 ఉన్నాయ్ ఇందులో Included 96 మరియు Excluded  (ఒకవేళ Excluded లో Transactions ఏమైనా ఉండి  అవి cancelled Transactions ఐతే పర్లేదు కానీ cancelled Transactions కూడా కాకుండా ఇంకేమైనా ఉంటె ఆ  Transactions ని Included గా మార్చిన తర్వాతే Auditor కి Export చేయాలి లేదంటే Taxable Amount మరియు Tax Amount Mismatch అవుతాయి) దగ్గర Null గా ఉంది కాబట్టి మనం Proceed అవ్వొచ్చు. Esc Button ప్రెస్ చేయాలి.

Esc Button ప్రెస్ చేసాక కింద  చూపిన విధంగా GSTR-1 report కి Redirect అవుతాము. ప్రతి ఒక్క Organization/company /Firm కి ప్రతి నెల Repeated గా జరిగే  task ఇది. Tally Prime/ Tally ERP9 లో GSTR-1 report ను Auditor కి Export చేసే ముందు మనం ముఖ్యంగా చెక్ చేస్కోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయ్ అవేంటో ఇప్పుడు చూద్దాం .

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 15

పైన ఇమేజ్ లో గమనించండి Uncertain Transactions (Correction Needed) కౌంట్ ఎప్పుడైనా compulsory Zero గా ఉండాలి (Uncertain Transactions దగ్గర Transactions ఏమైనా ఉంటే అవన్నీ Mistakes అని అర్ధం ఆ Transactions అన్ని correct చేసిన తర్వాతే Auditor కి Export చేయాలి). Incomplete Information in HSN/SAC Summary(Corrections Needed ) కౌంట్ ఎప్పుడైనా compulsory Zero గా ఉండాలి. Finally మనం check చేస్కోవాల్సినది ఏంటి అంటే GSTR-1 report లో Total Taxable Amount  GSTR-3B లో Taxable తో match అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇది చెక్ చేసుకోడానికి Tally Prime లో Easy అదే Tally ERP9 లో అయితే  Tough టాస్క్.

అందుకోసం Alt +G ప్రెస్ చేసి కింద చూపిన విధంగా GSTR-3B మీద ప్రెస్ చేయాలి.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 16

GSTR-3B మీద ప్రెస్ చేసాక F2 ప్రెస్ చేసి కింద చూపిన విధంగా మనం GSTR-1 Report కి ఏ  Period ఎంటర్ చేసామో ఆ  particular Period ఇక్కడ ఎంటర్ చేయాలి.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 17

Period ఎంటర్ చేసాక కింద చూపిన విధంగా GSTR-3B Report ఓపెన్ అవుతుంది. ఇక్కడ  గమనించండి Taxable Amount 94,59,582.45 గా ఉంది అలాగే GSTR 1 లో కూడా Taxable Amount 94,59,582.45 గా ఉంది కాబట్టి Taxable Amount match అయింది. Esc Button ప్రెస్ చేయాలి.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 18

Esc Button ప్రెస్ చేసాక కింద  చూపిన విధంగా GSTR-1 report కి Redirect అవుతాము. ఇప్పుడు Not Relevant in this Return అని ఉంది కదా ఇది సెలెక్ట్ చేసి Enter Key ప్రెస్ చేయాలి.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 19

Enter Key ప్రెస్ చేసాక మనకి కింద చూపిన విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో Sales కి సంబందించిన Transactions రావొద్దు ఒకవేళ వచ్చాయి అంటే అవి మనం miss చేస్తున్నామని అర్ధం. కింద  ఇమేజ్ లో గమనించండి Sales కి సంబందించిన Transactions ఏమి రాలేదు కాబట్టి Esc Button ప్రెస్ చేయాలి.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 20

ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్నాం కదా అన్ని పర్ఫెక్ట్ గా  ఉన్నాయ్ కాబట్టి ఇప్పుడు ఈ Report ను ఎలా Export చేయాలో చూద్దాం.

Export చేయడానికి మెనులో కింద చూపిన విధంగా E : Export ఆప్షన్ ఉంది కదా E కింద సింగల్లైన్ ఉంది కాబట్టి Alt +E ప్రెస్ చేయాలి.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 21

Export  లో E -Return మీద క్లిక్ చేయాలి లేదంటే E అనే లెటర్ Bold చేసి ఉంది కాబట్టి E ప్రెస్ చేసిన సరిపోతుంది.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 22

E -Return ప్రెస్ చేసాక కింద చూపిన విధంగా Export Dialogue Box  open అవుతుంది. ఇందులో File Format దగ్గర ముందుగా మనం చెప్పుకున్నాం కదా 3 Formats లో Export చేసుకోవచ్చు అని కింద గమనించండి ఆ 3 Formats ఇక్కడ ఉన్నాయ్. ఫస్ట్ JSON Format లో డౌన్లోడ్ చేసుకుందాం అందుకు File Format దగ్గర కింద చూపిన విధంగా JSON అని సెలెక్ట్ చేసుకోవాలి.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 23

File Format సెలెక్ట్ చేసాక Export separate files for each Section  దగ్గర డెఫజుల్ట్గా No అని ఉంది ఒకవేళ GSTR-1 లో ఉన్న ఫైల్స్ అన్ని separate గా Export చేసుకోవాలి అనుకుంటే yes అని సెలెక్ట్ చేసుకోవాలి(QRMP Registered Dealers కి బాగా use అవుతుంది ఈ Feature Tally Prime లో మాత్రమే available గా ఉంది ). ప్రెసెంట్ ఇక్కడ ఎం చేంజ్ చెయ్యట్లేదు.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 24

Next Folder Path  దగ్గర మనం Export చేసే ఫైల్ ఏ  Folder లో ఫైల్ చేయాలనుకుంటే ఆ Folder Path   ను ఇక్కడ ఎంటర్ చేయాలి. Folder Path ను ఎంటర్  చేయడానికి కింద చూపిన విధంగా Specify Path మీద క్లిక్ చేయాలి.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 25

దానికోసం Tally Prime ని minimize చేస్కుని కింద చూపిన విధంగా ఆ particular Folder ను  ఓపెన్ చేసి copy చేసుకోవాలి.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 26

ఇప్పుడు Tally Prime ను maximize  చేసి Specify Path లో Paste చేసి  Enter Key ప్రెస్ చేయాలి.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 27

Enter Key ప్రెస్  చేసాక HSN/SAC Summary దగ్గర default గా Yes అని ఉంది(టర్నోవర్ Below 1.5 crore ఉంటే HSN code మెయింటైన్  చేయాల్సిన అవసరం లేదు.టర్నోవర్ 1.5 – 5 crore ఉంటే 4 – character HSN code మెయింటైన్ చేయాలి .above 5 crore  టర్నోవర్ ఉంటే 6 – character HSN code మెయింటైన్ చేయాలి .) ఇది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు.
Allow Export of దగ్గర కింద చూపిన విధంగా  All Vouchers అని సెలెక్ట్ చేసుకోవాలి.
How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 32-1
Export  చేయడానికి కింద  చూపిన విధంగా Send మీద క్లిక్ చేయాలి.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 28

Send మీద క్లిక్ చేసాక కింద చూపిన విధంగా Export అయి మళ్ళీ GSTR 1 Report పేజీ కి వస్తాం.ఇప్పుడు Export చేసిన ఫైల్ సేవ్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. దానికోసం Tally Prime ని minimize చేస్కుని కింద చూపిన విధంగా ఫోల్డర్ ను ఓపెన్ చేయాలి. కింద ఇమేజ్ గమనించండి  Export చేసిన JSON ఫైల్ save  అయింది కదా .

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 29

అలానే ఇప్పుడు Excel Format లో కూడా  Export చేసి చూద్దాం .ఇప్పుడు మెనులో Export >E -Return ను కింద చూపిన విధంగా సెలెక్ట్ చేయాలి.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 30

E -Return ప్రెస్ చేసాక కింద చూపిన విధంగా Export Dialogue Box  open అవుతుంది. ఇందులో File Format దగ్గర కింద చూపిన విధంగా Excel అని సెలెక్ట్ చేసుకోవాలి.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 31

Next Folder Path  దగ్గర మనం Export చేసే ఫైల్ ఏ  Folder లో ఫైల్ చేయాలనుకుంటే ఆ Folder Path   ను ఇక్కడ ఎంటర్ చేయాలి. Folder Path ను ఎంటర్  చేయడానికి కింద చూపిన విధంగా Specify Path మీద క్లిక్ చేసి Tally Prime ని minimize చేసి  folder ఓపెన్ చేసి Path  ను copy చేస్కుని Tally Prime ను maximize  చేసి Specify Path లో Paste చేసి  Enter Key ప్రెస్ చేయాలి.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 32

Export  చేయడానికి కింద  చూపిన విధంగా Send మీద క్లిక్ చేయాలి.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 33

Send మీద క్లిక్ చేసాక కింద చూపిన విధంగా Export అవుతుంది.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 34

ఇప్పుడు Export చేసిన ఫైల్ సేవ్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. దానికోసం Tally Prime ని minimize చేస్కుని కింద చూపిన విధంగా ఫోల్డర్ ను ఓపెన్ చేయాలి. కింద ఇమేజ్ గమనించండి  Export చేసిన Excel ఫైల్ save  అయింది కదా .

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 35

అలానే ఇప్పుడు CSV Format లో కూడా  Export చేసి చూద్దాం . CSV Format లో Export చేయడానికి ముందు CSV అనే ఫోల్డర్ ను create  చేసుకోవాలి. ఇప్పుడు మెనులో Export >E -Return ను కింద చూపిన విధంగా సెలెక్ట్ చేయాలి.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 36

E -Return ప్రెస్ చేసాక కింద చూపిన విధంగా Export Dialogue Box  open అవుతుంది. ఇందులో File Format దగ్గర కింద చూపిన విధంగా CSV అని సెలెక్ట్ చేసుకోవాలి.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 37

Next Folder Path  దగ్గర మనం Export చేసే ఫైల్ ఏ  Folder లో ఫైల్ చేయాలనుకుంటే ఆ Folder Path   ను ఇక్కడ ఎంటర్ చేయాలి. Folder Path ను ఎంటర్  చేయడానికి కింద చూపిన విధంగా Specify Path మీద క్లిక్ చేసి Tally Prime ని minimize చేసి  folder ఓపెన్ చేసి Path  ను copy చేస్కుని Tally Prime ను maximize  చేసి Specify Path లో కింద చూపిన విధంగా Paste చేసి  send మీద క్లిక్ చేయాలి.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 38

Send మీద క్లిక్ చేసాక కింద చూపిన విధంగా Export అవుతుంది.

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 39

ఇప్పుడు Export చేసిన ఫైల్ సేవ్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. దానికోసం Tally Prime ని minimize చేస్కుని కింద చూపిన విధంగా ఫోల్డర్ ను ఓపెన్ చేయాలి. కింద ఇమేజ్ గమనించండి  Export చేసిన CSV ఫైల్ save  అయింది కదా .

How to Export GSTR 1 Report Tally Prime into Excel, CSV, Json formats in Telugu 40

ఇప్పుడు మనం Tally Prime సాఫ్ట్వేర్ లో GSTR-1 రిపోర్ట్ ను Excel, CSV, Json formats లో  ఎలా Export చేయాలి అని తెలుసుకున్నాం కదా .

ఇలాంటి Tally Prime కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి,  Tally Prime సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.

ఇలాంటి  ట్యుటోరియల్స్ ఇంకా  కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top