GSTR 1 రిపోర్ట్ Marg ERP లో ఎలా Export చేయాలి అని మనం ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్ లో మనం GSTR 2 రిపోర్ట్ Marg ERP లో ఎలా Export చేయాలి అని తెలుసుకుందాం.
GSTR 2 Returns మీద క్లిక్ చేసాక కింద చూపిన విధంగా వస్తుంది. Government పోర్టల్ లో GSTR 1 Returns ని 2 Formats(Excel ,CSV ) లో accept చేస్తుంది.
ఇప్పుడు మనం Excel Format లో Export చేద్దాం దానికోసం పైన చూపినట్లు గా GSTN Excel Template ఆప్షన్ దగ్గర ఉన్న బటన్ మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది.
Next పైన ఇమేజ్ లో చూపినట్లు అన్ని CheckBox మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుని Start బటన్ మీద క్లిక్ చేయాలి.
Start బటన్ మీద క్లిక్ చేసాక Select Directory ఓపెన్ అవుతుంది ఇందులో మనం Export చేసే ఫైల్ ఏ ఫోల్డర్ లో సేవ్ అవ్వాలి అనుకుంటున్నామో ఆ ఫోల్డర్ ను సెలెక్ట్ చేసుకోవాలి.ఉదాహరణకు ఇక్కడ EXPORT MARG FILES ఫోల్డర్ ను పైన చూపిన విధంగా సెలెక్ట్ చేసుకుందాం.
EXPORT MARG FILES ఫోల్డర్ ను సెలెక్ట్ చేసుకుని OK బటన్ మీద క్లిక్ చేయాలి.
పైన ఇమేజ్ లో గమనించండి GSTR 2 Report generate అవుతుంది. GSTR 2 Report generate అయ్యాక కింద చూపిన విధంగా చూపిస్తుంది అంటే ఈ RED TICK మార్క్ వచ్చిన ఫైల్స్ అన్ని generate అయ్యాయి అని అర్ధం.
ఫైల్స్ అన్ని generate అయ్యాక File సేవ్ అయినట్లుగా ఇలా నోటిఫికేషన్ వస్తుంది OK మీద క్లిక్ చేయాలి.
OK మీద క్లిక్ చేసాక పైన చూపిన విధంగా Excel ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ Save As మీద క్లిక్ చేసి Browse చేసి మనకి నచ్చిన Folder లో సేవ్ చేసుకోవచ్చు.
ఈ ఫైల్ ఆల్రెడీ సేవ్ అయి ఉంది కాబట్టి క్లోజ్ చేసుకోవాలి.
ఇప్పుడు File సేవ్ అయింది కాబట్టి ఒకసారి చెక్ చేసుకుందాం దానికోసం MARG సాఫ్ట్వేర్ ను minimize చేసుకుని EXPORT MARG FILES ఫోల్డర్ లో Export అయిన file ను ఓపెన్ చేసి చూద్దాం.
కింద ఇమేజ్ లో గమనించండి Excel Format లో GSTR 2 ఫైల్ పర్ఫెక్ట్ గా Export ఐంది.
ఇలా Export ఐన ఫైల్ ను Auditor కి Mail చేసుకోవచ్చు.
సో ఇలా మనం GSTR 2 రిపోర్ట్ Marg ERP లో ఎలా Export చేయాలి అని తెలుసుకున్నాం కదా.
ఇలాంటి Marg సాఫ్ట్వేర్ కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి, Marg సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.
ఇలాంటి ట్యుటోరియల్స్ ఇంకా కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.