QRMP Returns రిపోర్ట్ Marg ERP లో ఎలా Export చేయాలి అని మనం ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్ లో మనం Composition డీలర్స్ CMP 08 రిటర్న్స్ Marg ERP లో Excel కి ఎలా Export చేయాలి అని తెలుసుకుందాం.
CMP 08 రిటర్న్స్ Export చేయడానికి ముందుగా మనం Marg ERP సాఫ్ట్వేర్ లో Composition డీలర్ కి సంబంధించిన ఒక కంపెనీ ని ఓపెన్ చేయాలి.
ఇప్పుడు మెనూ లో కింద చూపిన విధంగా GST ఆప్షన్ మీద క్లిక్ చేసి DropDown లో CMP 08 Quarterly Return ను సెలెక్ట్ చేసుకోవాలి.
CMP 08 Quarterly Return ను సెలెక్ట్ చేసాక కింద చూపిన విధంగా నోటిఫికేషన్ వస్తుంది. Auditors డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అనుకుంటే Yes మీద క్లిక్ చేయాలి లేదంటే No మీద క్లిక్ చేయాలి.ఇక్కడ మనం Auditors డీటెయిల్స్ ఏమి ఇవ్వట్లేదు సో No మీద క్లిక్ చేయాలి.
Select Period దగ్గర మనం ఏ Quarter(Apr -Jun ,Jul -Sept ,Oct -Dec ,Jan -Mar) యొక్క CMP 08 Export చేయాలో అనుకుంటున్నామో ఆ Quarter ను కింద చూపిన విధంగా సెలెక్ట్ చేయాలి(సెలెక్ట్ చేయడానికి Up & Down arrow ని ఉపయోగించాలి). ఉదాహరణకు ఇక్కడ Jul -Sept అనే Quarter ను కింద చూపిన విధంగా సెలెక్ట్ చేసుకుందాం.
Next Tax on దగ్గర కింద చూపిన విధంగా Gross అని సెలెక్ట్ చేయాలి.(మనం Composition డీలర్ కి సంబందించిన Returns ఫైల్ చేస్తున్నాం Composition డీలర్స్ కస్టమర్ల దగ్గర ఎలాంటి Tax కల్లెక్ట్ చేయకూడదు కాబట్టి Gross అని సెలెక్ట్ చేయాలి ).పైగా ఈ Quarter లో జరిగిన సేల్స్ మీద Government కి 1% Tax పే చేయాలి.
Next Name ,Designation & Place ఇవి ఆప్షనల్ Fill చేయకపోయినా పర్లేదు. Excel మీద Enter Key ప్రెస్ చేయాలి.
Enter Key ప్రెస్ చేసాక Excel Report Generate అవుతుంది. Report generate అయ్యాక ఇలా Invoice చూపిస్తుంది Close బటన్ మీద క్లిక్ చేయాలి.
Close బటన్ మీద క్లిక్ చేసాక Report generate అవుతున్నట్లుగా చూపిస్తుంది(కింద ఇమేజ్ లో గమనించండి) .
Export అయ్యాక File సేవ్ అయినట్లుగా ఇలా నోటిఫికేషన్ వస్తుంది OK మీద క్లిక్ చేయాలి.
OK మీద క్లిక్ చేసాక కింద చూపిన విధంగా Excel ఫైల్ ఓపెన్ అవుతుంది.
కింద చూపిన విధంగా File >Save As >Browse క్లిక్ చేసి ఈ Excel Report ను Save చేసుకోవచ్చు.
కింద చూపినట్లుగా D :/EXPORT MARG FILES అనే folder ను సెలెక్ట్ చేసి Open బటన్ మీద క్లిక్ చేసి సేవ్ మీద ప్రెస్ చేయాలి.
చూసారుకదా ఈ విధంగా మనం CMP 08 రిటర్న్స్ ను Excel Format లో Export చేసాం.
సో ఇలా మనం Composition డీలర్స్ CMP 08 రిటర్న్స్ Marg ERP లో Excel కి ఎలా Export చేయాలి అని తెలుసుకున్నాం కదా.
ఇలాంటి Marg సాఫ్ట్వేర్ కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి, Marg సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.
ఇలాంటి ట్యుటోరియల్స్ ఇంకా కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.