మార్గ్ సాఫ్ట్వేర్ లో ఒక కంపెనీని ఫైనాన్షియల్ ఇయర్ గా ఎలా బ్యాకప్ చేయాలో ముందు ఆర్టికల్ లో మనం తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్ లో మనం MARG సాఫ్ట్వేర్ లో కంపెనీ బ్యాక్ అప్ ని ఏ విధంగా డిలీట్ చేయాలి అని తెలుసుకుందాం. దానికోసం మార్గ్ సాఫ్ట్వేర్ లో List Of Companies ని ఓపెన్ చేసుకోవాలి.
ఆ లిస్ట్ లో మనం ఏ కంపెనీ బ్యాకప్ ని డిలీట్ చేయాలి అనుకుంటున్నామో దానిని సెలక్ట్ చేసుకుని ఎంటర్ బటన్ ని ప్రెస్ చేయాలి. అప్పుడు ఇలా వస్తుంది.
పైన ఇమేజ్ లో మనకు కనిపించేవి షార్ట్ కట్స్, మనకి అవసరైనమైన దానిని బట్టి వాటిని యూస్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనకు కావాల్సింది డిలీట్ చేయడం కాబట్టి F అనే బటన్ ని ప్రెస్ చేయాలి. అప్పుడు ఈ క్రింది విధంగా వస్తుంది.
మనం ఏ ఫైనాన్షియల్ ఇయర్ ని డిలీట్ చేయాలి అనుకుంటామో ఆ ఇయర్ ని సెలక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి, అప్పుడిలా వస్తుంది.
మార్గ్ సాఫ్ట్వేర్ లో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏమిటంటే! ఒక కంపెనీని డిలీట్ చేయాలి అంటే కూడా ముందుగా దానిని బ్యాకప్ తీసుకోవాలి. బ్యాకప్ చేసిన తరువాతనే డిలీట్ అవుతుంది. ఇలాంటి ఆప్షన్ వేరే పెద్ద పెద్ద అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లలో కూడా లేదు. పైన ఇచ్చిన వాటిలో ఏదీ కూడా మనం చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడిలా వస్తుంది.
పైన ఇమేజ్ లో చూస్తే Progress దగ్గర 100% కంప్లీట్ అయితే బ్యాకప్ అవ్వడం అయిపోతుంది. అప్పుడు మనల్ని డిలీట్ చేయాలా వద్దా అని అడుగుతుంది. డిలీట్ చేయాలి అంటే ఆక్కడ ఉన్న బ్లాంక్ బాక్స్ లో డిలీట్ అని టైప్ చేయాల్సి ఉంటుంది.
డిలీట్ అని టైప్ చేశాక మనకు కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ డిలీట్ అవుతున్నట్లే. మనకి క్రింద ఇమేజ్ చూస్తే అర్థం అవుతుంది.
Progress దగ్గర 100% కంప్లీట్ అయితే కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ డిలీట్ అయిపోయినట్లే. ఈ విధంగా లిస్ట్ ఆఫ్ కంపెనీస్ లో మనకు కావాల్సిన ఒక కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ ను డిలీట్ చేసుకోవచ్చు.