MARG సాఫ్ట్వేర్ లో డిలీట్ చేసిన ఒక కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ ని ఏ విధంగా రీస్టోర్ చేయాలో మనం ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్ లో మనం MARG సాఫ్ట్వేర్ లో బాచ్ వైస్ గా స్టాక్ రిపోర్ట్స్ ఎలా తెలుసుకోవాలి అని తెలుసుకుందాం. దానికోసం మార్గ్ సాఫ్ట్వేర్ లో మెనూ లో Stocks లో Batch Stock మీద క్లిక్ చేయాలి. ( క్రింది ఇమేజ్ లో విధంగా )
Batch Stock మీద క్లిక్ చేస్తే Batch Stock కి సంబంధించిన డైలాగ్ బాక్స్ వస్తుంది. అందులో మనకి కావాల్సిన Stock డీటైల్స్ ఇవ్వవచ్చు.
పైన ఇమేజ్ లో Stock as on అని కనిపిస్తుంది కదా అక్కడ మీకు కావాల్సిన డేట్ ఇవ్వండి. తర్వాత Selected Company దగ్గర డీఫాల్ట్ గా No అని ఉంటుంది, దాన్ని చేంజ్ చేయడం కోసం స్పేస్ బార్ మీద ప్రెస్ చేస్తే Yes or No అనే ఆప్షన్స్ కనిపిస్తాయి, మనం Yes ని సెలక్ట్ చేసుకుంటే క్రింది విధంగా వస్తుంది.
పైన ఇమేజ్ లో మనకు రెండు బాక్సెస్ కనబడుతున్నాయి కదా, ఒకటి Control Box ; రెండోది Select Company. Select Company లో ఉన్న కంపెనీస్ లో మనకి ఏది కావాలో సెలెక్ట్ చేసుకోడానికి మరియు డీసెలక్ట్ చేయడం కోసం Control Box లో షార్ట్ కట్స్ ని గమనిస్తే అర్దం అవుతుంది.
Select Company లో ఉన్న కంపెనీస్ లో ఏదైనా ఒక దానిని సెలక్ట్ చేయాలి అంటే దానిమీద కర్సర్ ఉంచి + ( ప్లస్ సింబల్ ని ) ప్రెస్ చేయాలి. సెలక్ట్ చేసిన కంపెనీని Unselect చేయాలి అంటే – ( మైనస్ బటన్ )ని ప్రెస్ చేయాలి. ఒక కంపెనీని కాకుండా లిస్ట్ లో ఉన్న మొత్తం కంపెనీస్ ని సెలక్ట్ చేయాలి అంటే Shift * ( షిఫ్ట్ బటన్ మరియు స్టార్ బటన్ ) ని ప్రెస్ చేయాలి. అన్ని కంపెనీస్ ని Unselect చేయాలి అంటే Shift / ( షిఫ్ట్ బటన్ మరియు స్లాష్ బటన్ ) ని ప్రెస్ చేయాలి.
ఇప్పుడు మనం అన్ని కంపెనీస్ బ్యాచ్ స్టాక్ చూద్దాం అనుకుంటున్నాం కాబట్టి అనీ కంపెనీస్ ని సెలక్ట్ చేయాలి, దానికోసం Shift * ( షిఫ్ట్ బటన్ మరియు స్టార్ బటన్ ) ని ప్రెస్ చేయాలి. అప్పుడు ఈ విధంగా అన్ని కంపెనీస్ సెలక్ట్ అవుతాయి.
ఇలా అన్ని కంపెనీస్ ని సెలక్ట్ చేసుకున్నాక ఎంటర్ ప్రెస్ చేయాలి. అప్పుడు ఇలా వస్తుంది.
పైన ఇమేజ్ లో Stock Status అని కనిపిస్తుంది కదా! దానిలో Available అని సెలక్ట్ అయ్యి ఉంది కదా ? అక్కడ స్పేస్ బార్ ప్రెస్ చేస్తే Whole, Available, random, negative And Positive అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. క్రింది ఇమేజ్ చూడండి.
Whole అంటే టోటల్ ఐటెమ్స్ కనిపించాలి అంటే ఇది సెలక్ట్ చేసుకోవాలి, Available అంటే స్టాక్ available ఐటెమ్స్ మాత్రమే కనిపించాలి అంటే దీనిని సెలక్ట్ చేసుకోవాలి, లేక random గానా , negative గానా And Positive గానా అనేది మన అవసరాన్ని బట్టి సెలక్ట్ చేసుకోవాలి. ప్రెసెంట్ అయితే మనం Available ని సెలక్ట్ చేసుకుంటున్నాం.
పైన ఇమేజ్ లో Stock Status తరువాత Selected salt అని ఉంది కదా అక్కడ డీఫాల్ట్ గా No అని ఉంటుంది అది అలాగే ఉంచుకోవాలి. అసలు ఈ salt అంటే ఏమిటి అంటే? Dolo 650 అనే టాబ్లెట్ ఉంది కదా దాని ఫార్ములా ఏమిటి అంటే Paracetamol . దానినే salt అని అంటారు. ప్రస్తుతం మనం Salt ని మెయింటైన్ చేయడం లేదు కాబట్టి అక్కడ ఉన్న No ని చేంజ్ చేయడం లేదు.
దాని తరువాత More Options అని ఉంది కదా అక్కడ కూడా డీఫాల్ట్ గా No అనే ఉంటుంది. మనం ఇంకా డెప్త్ కండిషన్స్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే అక్కడ క్లిక్ చేస్తే Yes And No అనే ఆప్షన్స్ వస్తాయి. అప్పుడు Yes మీద క్లిక్ ఇవ్వాలి అప్పుడిలా వస్తుంది.
పైన ఇమేజ్ లో చూస్తే మనకు చాలా ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి, అందులో మీకు అవసరం అయిన వాటిని ఫిల్ చేయండి. ప్రస్తుతం అయితే మనకి వాటితో అవసరం లేదు కాబట్టి Esc ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి ఇలా వస్తుంది.
పైన ఇమేజ్ లో Accept అని కనిపిస్తుంది కదా అక్కడ ప్రెస్ చేయాలి. అప్పుడిలా వస్తుంది.
పైన ఇమేజ్ లో చూస్తే ప్రతి ఒక మెడిసెన్ కూడా బ్యాచ్ వైస్ గా వచ్చింది. ఆ బ్యాచెస్ లో మనం దేని మీద సెలక్ట్ అయ్యి ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బ్యాచ్ లిస్ట్ కింద కనిపిస్తుంది ( బ్లూ కలర్ టెక్స్ట్ ). A to Z Tab అనేది 3 బ్యాచెస్ గా వచ్చింది. అందులో ప్రస్తుతం మనం 22490141 అనే బ్యాచ్ మీద సెలక్ట్ అయ్యి ఉన్నాం కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లిస్ట్ లో కింద కనిపిస్తుంది.
ఈ ఇన్ఫర్మేషన్ లో ఆ బ్యాచ్ యొక్క పర్చేజ్ కాస్ట్, సేల్ రేట్, ట్యాక్స్ ఎంత? సప్లయ్ చేసిన కంపెనీ ఏమిటి?, HSN code ఏమిటి? ఇలా ఆ బ్యాచ్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అక్కడ చూడవచ్చు. ఒకవేళ మనం ఇందులో ఏదైనా ఎడిట్ చేయాలి అనుకుంటే F3 అనే షార్ట్ కట్ కీని ప్రెస్ చేయాలి. అప్పుడిలా వస్తుంది.
F3 ప్రెస్ చేస్తే పైన ఇమేజ్ లో లాగా Batch Detail Window ఓపెన్ అవుతుంది. ఏమైనా ఎడిట్ చేయాలి అంటే ఇక్కడ చేసుకోవచ్చు. ప్రెసెంట్ ఏమీ అవసరం లేదు అనుకుంటే Esc ప్రెస్ చేస్తే మళ్ళీ బ్యాచ్ లిస్ట్ వస్తుంది. F5 ప్రెస్ చేస్తే సెర్చ్ డైలాగ్ బాక్స్ వస్తుంది.
Search On లో Find Name మీద క్లిక్ చేస్తే నేమ్ ని బేస్ చేసుకుని సార్ట్ అవుట్ ( Sort out ) చేసుకోవాలా వద్దా అనేది చూపిస్తుంది. క్రింద ఇమేజ్ చూడండి.
మనం ఏ మెడిసెన్ మీద సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే దానికి సంబంధించిన Batch Register డైలాగ్ బాక్స్ వస్తుంది.
పైన ఇమేజ్ లో కనిపించే View మీద క్లిక్ ఇస్తే మనం సెలెక్ట్ చేసిన బ్యాచ్ కు సంబంధించిన రిజిస్టర్ వస్తుంది. క్రింద ఇమేజ్ చూడండి.
పైన ఇమేజ్ లో A to Z Tab కి సంబంధించిన పర్టిక్యులర్స్ చూడవచ్చు. అంటే ఆ బ్యాచ్ లో వచ్చిన మెడిసెన్స్ ఎన్ని? ఎన్ని సేల్ అయ్యాయి? ఇంకా స్టాక్ ఎంత ఉంది అనే డీటైల్డ్ ఇన్ఫర్మేషన్ అక్కడ చూడవచ్చు. అలా మనం ఏ బ్యాచ్ కి సంబంధించిన డీటైల్స్ కావాలి అంటే ఆ డీటైల్స్ ఈ ప్రాసెస్ ద్వారా చూసుకోవచ్చు. Esc ప్రెస్ చేస్తే మళ్ళీ బ్యాచ్ లిస్ట్ వస్తుంది.
ఈ విధంగా MARG సాఫ్ట్వేర్ లో బ్యాచ్ వైస్ గా స్టాక్ రిపోర్ట్స్ తెలుసుకోవచ్చు.
ఇలాంటి Marg సాఫ్ట్వేర్ కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి, Marg సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.
ఇలాంటి ట్యుటోరియల్స్ ఇంకా కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.