Marg సాఫ్ట్వేర్ లో ఒక కంపెనీని ఎలా క్రియేట్ చేయాలో మనం ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్ లో మనం మార్గ్ సాఫ్ట్వేర్ లో ఒక కంపెనీని ఫైనాన్షియల్ ఇయర్ గా ఎలా బ్యాకప్ చేయాలో తెలుసుకుందాము.
మార్గ్ సాఫ్ట్వేర్ ని ఓపెన్ చేయగానే మనకి List Of Companies అని కనిపిస్తుంది. ప్రస్తుతం మనకి ఉన్న లిస్ట్ లో APOLLO PHARMACIES LIMITED అనే కంపెనీ ఉంది. ( క్రింద ఇమేజ్ చూడండి)
ఇప్పుడు ఒకసారి ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఈ క్రింది విధంగా వస్తుంది.
పైన ఇమేజ్ లో మనకు 7 ఆప్షన్స్ అనేవి కనిపిస్తునాయి. వాటిలో మనకిప్పుడు కావలసింది BACKUP OF FINANCIAL YEAR కాబట్టి C అనే ఆప్షన్ ని సెలక్ట్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేయాలి. C ని ప్రెస్ చేస్తే మనకి క్రింద ఇమేజ్ లో విధంగా ఆల్రెడీ ఎన్ని ఫైనాన్షియల్ ఇయర్స్ ఉన్నాయి మనం ఎంట్రీ చేసినవి అనేది చూపిస్తుంది. 1 st ఏప్రిల్ తో స్టార్ట్ అయ్యి 31st మార్చి తో ఎండ్ అయ్యే ఇయర్ ని ఫైనాన్షియల్ ఇయర్ అని అంటారు.
ప్రస్తుతం మనం కరంట్ ఇయర్ అంటే 2022 – 2023 ఫైనాన్షియల్ ఇయర్ ను బ్యాకప్ చేసుకుందాము. దానికోసం ఇప్పుడు 2022 – 2023 ని సెలక్ట్ చేసి ఎంటర్ ని ప్రెస్ చేయాలి. అప్పుడు మనకు ఇలా వస్తుంది.
మనం ఆల్రెడీ డైరెక్టరీ ని సెలక్ట్ చేసుకుని పెట్టుకుంటే Ok, లేకపోతే F 10 ప్రెస్ చేసి మనకు ఏ డైరెక్టరీ లో కావాలో అక్కడ కంపెనీని బ్యాకప్ చేయవచ్చు. ప్రస్తుతం మనం సెలక్ట్ చేసుకున్నది D:\BACKUP271122\ . అంటే D డ్రైవ్ లో BACKUP271122 అనే ఫోల్డర్ లో ఈ కంపెనీ బ్యాకప్ అవుతుంది.
ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేశాక Backup of Batch History & Backup of Transaction History అనే ఆప్షన్స్ దగ్గర Yes అని సెలక్ట్ చేసుకోవాలి. మిగిలిన Cloud Backup, FTP Backup, EMAIL Backup అనే ఆప్షన్స్ దగ్గర No అనే ఉండాలి. (క్రింద ఇమేజ్ లో లాగా)
ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయాలి అలా ప్రెస్ చేశాక కంపెనీ బ్యాకప్ అవుతుంది.
ఇప్పుడు కంపెనీ బ్యాకప్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసి చూసుకోవాలి. దానికోసం మార్గ్ సాఫ్ట్వేర్ ని Minimize చేసుకోవాలి.
ఇప్పుడు My PC అనే దానిని సెలక్ట్ చేసుకోవాలి. అందులో D drive అంటే Data ని సెలక్ట్ చేయాలి. ( స్టార్టింగ్ లో బ్యాకప్ ఎక్కడ అవ్వాలి అని మీరు సెలక్ట్ చేసుకున్నారో అది సెలక్ట్ చేసుకోండి.)
data ని ఓపెన్ చేశాక BACKUP271122 అనే ఫోల్డర్ ని సెలక్ట్ చేసుకోవాలి.
BACKUP271122 అనే ఫోల్డర్ని ఓపెన్ చేస్తే కంపెనీ బ్యాకప్ ఫైల్ ఉంటుంది. ఈ విధంగా మనం మార్గ్ సాఫ్ట్వేర్ లో ఒక కంపెనీ బ్యాకప్ ని క్రియేట్ చేయవచ్చు.