Marg ERP సాఫ్ట్వేర్ లో Route మాస్టర్స్ ఎలా క్రియేట్ చేయాలి అని మనం ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్ లో మనం Marg ERP సాఫ్ట్వేర్ లో Company మాస్టర్స్ ఎలా క్రియేట్ చేయాలి అని తెలుసుకుందాం.
మనం ఏ Company మాస్టర్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో వాటికి సంబధించిన ఇన్ఫర్మేషన్ అంతా ముందే నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది.
Company Master మీద క్లిక్ చేస్తే మనకి క్రింద ఇమేజ్ లో లాగా వస్తుంది.
కింద ఇమేజ్ లో చూస్తే మనకి లెఫ్ట్ సైడ్ లో చిన్న డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది కదా పైన ఇమేజ్ లో చుడండి Bottom మెనూ లో shortcut keys ఇచ్చారు F2-Create New, F3-Modify, Del-Delete : మనం న్యూగా HSN కోడ్ క్రియేట్ చేయాలి అంటే F2 అని ఆల్రెడీ చేసిన దానిలో ఏమైనా చేంజెస్ చేయాలి అంటే F3 అని కోడ్ తప్పుగా ఏమైనా క్రియేట్ చేస్తే డిలీట్ చేయాలి అంటే Del అనే షార్ట్ కట్స్ యూస్ చేయాలి. ప్రెసెంట్ మనకి కావలసింది క్రియేట్ న్యూ కాబట్టి F2ప్రెస్ చేయాలి. అప్పుడు ఇలా వస్తుంది.
F2 ప్రెస్ చేశాక కింద చూపిన విధంగా New Company అని వస్తుంది. మనం అందులో మనకి కావాల్సిన కంపెనీ డీటైల్స్ ని ఇవ్వాల్సి ఉంటుంది.
Name దగ్గర ఆల్రెడీ నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకున్నాం కాబట్టి కింద చూపిన విధంగా Copy చేసుకోవాలి.
ఇలా Name దగ్గర Paste చేసుకోవాలి.
Next Preferences అంటే Companies లిస్ట్ లో ఈ కంపెనీ ఫస్ట్ కనపడాలి అనుకుంటున్నాను కాబట్టి order form మరియు Invoice Form లో 1 అని enter చేసుకోవాలి.
Next Dump Days డిఫాల్ట్ గా 60 అని చూపిస్తుంది కదా అంటే ఆ 60 Days లోపు సేల్ కానీ products ను చూపిస్తుంది. దీనివల్ల మనం ఏ products పైన unnecessary గా ఇన్వెస్ట్ చేస్తున్నాము ఏ products ను తొందరగా సేల్ చేసుకోవాలి అనేది తెలుసుకోవచ్చు.
Next Expiry Receive Upto డిఫాల్ట్ గా 90 అని చూపిస్తుంది కదా అంటే ఆ 90 Days లోపు Expire అయ్యే products ను చూపిస్తుంది. దీనివల్ల మనం ఏ products Return ఇవ్వాలి ఏ products ను తొందరగా సేల్ చేసుకోవాలి అనేది తెలుసుకోవచ్చు. minimum margin అంటే మనం product ను దాని Cost కంటే తక్కువకి సేల్ చేస్తే అంత red కలర్ కి మారిపోతుంది దానికోసం మనం minimum margin ని fix ఉంటుంది.
Next Sales Tax GST వచ్చాక మనకి Multiple Taxes ఉన్నాయ్ కాబట్టి ఇది enter చేయాల్సిన అవసరం లేదు. Enter Key 2 లేదా 3 సార్లు ప్రెస్ చేస్తే కింద చూపిన విధంగా Save Changes అని అడుగుతుంది.Yes ప్రెస్ చేస్తే save అవుతుంది.
Save చేసాక కింద చూపిన విధంగా మనం create చేసిన Company master add అవుతుంది.
ఇలాంటి Marg సాఫ్ట్వేర్ కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి, Marg సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.
ఇలాంటి ట్యుటోరియల్స్ ఇంకా కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.