Tally Prime సాఫ్ట్వేర్ లో ప్లస్ (+), మైనస్ (-) బటన్స్ ఎలా యూస్ చేయాలి అని మనం ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్ లో మనం GSTR-3B రిపోర్ట్ Tally Prime లో ఎలా ప్రింట్ చేయాలి అని తెలుసుకుందాం.
Display More Reports లో GST Reports ను సెలెక్ట్ చేయాలి.
GST Reports లో GSTR-3B ను సెలెక్ట్ చేయాలి.
GSTR-3B ను సెలెక్ట్ చేసాక కింద చూపిన విధంగా GSTR-3B Report ఓపెన్ అవుతుంది.
సెకండ్ Method ఏంటంటే Gateway of Tally లో Alt + G ప్రెస్ చేయాలి. Alt + G అంటే Go To కి షార్ట్ కట్ కీ. Alt + G ప్రెస్ చేస్తే క్రింది విధంగా GO TO డైలాగ్ బాక్స్ వస్తుంది.
GSTR-3B ను సెలెక్ట్ చేసాక పైన చూపిన విధంగా GSTR-3B Report ఓపెన్ అవుతుంది.
F 12 ప్రెస్ చేసాక కింద చూపిన విధంగా Configuration Dialogue Box ఓపెన్ అవుతుంది.ఇందులో కింద చూపిన విధంగా Show Tax types in separate columns దగ్గర డిఫాల్ట్ గా No అని ఉంది yes అని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే Format of Report దగ్గర Detailed అని సెలెక్ట్ చేసుకుని Enter Key ప్రెస్ చేయాలి.
పైన ఇమేజ్ లో గమనించండి Uncertain Transactions (Correction Needed) కౌంట్ ఎప్పుడైనా compulsory Zero గా ఉండాలి (Uncertain Transactions దగ్గర Transactions ఏమైనా ఉంటే అవన్నీ Mistakes అని అర్ధం ఆ Transactions అన్ని correct చేసిన తర్వాతే Auditor కి Export చేయాలి).
Esc Button ప్రెస్ చేసాక పైన చూపిన విధంగా GSTR-3B Report కి Redirect అవుతాము.
ఇక్కడ మనం GSTR-1 మరియు GSTR-2 Reports ను Export చేయాలనుకున్నప్పుడు మనం మెనులో Export option ను ఉపయోగిస్తాము కానీ GSTR-3B Report కి మాత్రం ఈ option ఉపయోగపడదు.GSTR-3B Report ను Export చేయడానికి మనం మెనులో Print option ను ఉపయోగించాల్సి ఉంటుంది.
GSTR-3B Report ను ఎలా ప్రింట్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం పైన చూపిన విధంగా P : Print ఆప్షన్ ఉంది కదా E కింద సింగల్లైన్ ఉంది కాబట్టి Alt +E ప్రెస్ చేసి Return Form మీద క్లిక్ చేయాలి.
Return Form మీద క్లిక్ చేసాక పైన చూపిన విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ Preview Button మీద క్లిక్ చేస్తే ఈ GSTR-3B Report ఎలా ప్రింట్ అవుతుందో చూసుకోవచ్చు.
చూసారుగా పైన చూపిన విధంగా మనం ప్రింట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి కావాల్సిన folder లో సేవ్ చేసుకుని Auditor కి mail చేయొచ్చు.
ఇప్పుడు మనం GSTR-3B రిపోర్ట్ Tally Prime లో ఎలా ప్రింట్ చేయాలి అని తెలుసుకున్నాం కదా.
ఇలాంటి Tally Prime కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి, Tally Prime సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.
ఇలాంటి ట్యుటోరియల్స్ ఇంకా కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.