MARG సాఫ్ట్వేర్ లో కంపెనీ బ్యాక్ అప్ ని ఏ విధంగా డిలీట్ చేయాలో ముందు ఆర్టికల్ లో మనం తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్ లో మనం MARG సాఫ్ట్వేర్ లో డిలీట్ చేసిన ఒక కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ ని ఏ విధంగా రీస్టోర్ చేయాలి అని తెలుసుకుందాము. దానికోసం ముందుగా MARG సాఫ్ట్వేర్ లో LIST OF COMPANIES ని ఓపెన్ చేయండి.
పైన ఇమేజ్ లో LIST OF COMPANIES లో మనకు APOLLO PHARMACIES LIMITED అని కనిపిస్తుంది కదా దాని మీద ఎంటర్ ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేయగానే మనకి ఇలా వస్తుంది.
పైన ఇమేజ్ లో మనకు Marg Gateway అని కనిపిస్తుంది కదా దానిని సెలక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి, అప్పుడిలా వస్తుంది.
పైన ఇమేజ్ లో గనక మనం గమనించినట్లయితే వాస్తవానికి 4 ఫైనాన్షియల్ ఇయర్స్ ఉండాలి. కానీ ఇక్కడ 3 ఫైనాన్షియల్ ఇయర్స్ మాత్రమే ఉన్నాయి. 2022-2023 అనే ఫైనాన్షియల్ ఇయర్ ఇక్కడ లేదు, అది డిలీట్ అయింది. మరి దీనిని ఎలా రీస్టోర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం Esc ని ప్రెస్ చేయాలి అప్పుడిలా వస్తుంది.
పైన ఇమేజ్ లో ఏ ఆప్షన్ కోసం ఏం షార్ట్ కట్ కీ యూస్ చేయాలో క్లియర్ గా ఇవ్వడం జరిగింది.
Marg Gateway షార్ట్ కట్ కీ A,
Files Maintenance షార్ట్ కట్ కీ B
Backup Of Financial Year షార్ట్ కట్ కీ C,
Restore Backup షార్ట్ కట్ కీ D,
New Financial Year షార్ట్ కట్ కీ E,
Delete Financial Year షార్ట్ కట్ కీ F,
Error Checkings & Rewriting షార్ట్ కట్ కీ G.
ఇప్పుడు మనం రీస్టోర్ చేయాలి కాబట్టి “D” అనే షార్ట్ కట్ కీ ప్రెస్ చేయాలి లేదా Restore Backup అనే దానిని సెలక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినా సరిపోతుంది. అప్పుడు ఇలా వస్తుంది.
పైన ఇమేజ్ లో రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా అందులో Restore From File అనే దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడిలా వస్తుంది.
పైన ఇమేజ్ లో చూస్తే Directory అని కనిపిస్తుంది కదా, అదేమిటంటే మనం కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ ని డిలీట్ చేసే ముందు బ్యాకప్ తీసుకున్న డేటా పాత్ ని సెలక్ట్ చేసుకోవడం కోసం. సో ఇప్పుడు Directory అనే దానిమీద క్లిక్ చేయాలి. అప్పుడు ఇలా వస్తుంది.
Data లో మనం బ్యాకప్ తీసుకున్న ఫైల్ ఏ ఫోల్డర్ లో ఉందో ఆ ఫోల్డర్ ని సెలక్ట్ చేసుకుని ok చేయాలి. ok చేశాక క్రింది ఇమేజ్ లో లాగా వస్తుంది.
పైన ఇమేజ్ లో ఉన్న నాలుగు బ్యాకప్ లలో రెడ్ కలర్ తో హైలెట్ చేసిన దానిని మనం ఇప్పుడు రీస్టోర్ చేయాలి. దానికోసం ముందుగా దానిని కర్సర్ తో సెలక్ట్ చేసుకుని తరువాత Select అనే బటన్ ప్రెస్ చేయాలి. అప్పుడు మనకు ఇలా వస్తుంది.
పైన ఇమేజ్ లో Exit & Restore అని మనకు రెండు బటన్స్ కనిపిస్తున్నాయి కదా మనం ఇప్పుడు రీస్టోర్ చేయాలి కాబట్టి Restore పై క్లిక్ ఇస్తే ఇలా వస్తుంది.
పైన ఇమేజ్ లో కనిపిస్తునట్లు 100% కంప్లీట్ అయితే ఇక రీస్టోర్ అయిపోయినట్లే. మరి అది రీస్టోర్ అయిందో లేదో మనం ఒకసారి చెక్ చేద్దాము. అలా చెక్ చేయడం కోసం List Of Companies లోకి వెళ్ళాలి.
పైన ఇమేజ్ లో Marg Gateway అని ఉంది కదా దాని మీద క్లిక్ ఇవ్వండి. అప్పుడు మనకు ఇలా వస్తుంది.
స్టార్టింగ్ లో మనకు 3 ఫైనాన్షియల్ ఇయర్స్ మాత్రమే కనిపించాయి కానీ ఇప్పుడు 4 ఫైనాన్షియల్ ఇయర్స్ కనిపిస్తున్నాయి. ఇలా చాలా ఈజీగా MARG సాఫ్ట్వేర్ లో డిలీట్ చేసిన ఒక కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ ని రీస్టోర్ చేసుకోవచ్చు.