Marg ERP సాఫ్ట్వేర్ లో Route మాస్టర్స్ ఎలా క్రియేట్ చేయాలి అని మనం ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్ లో మనం Income Tax and GST ఫైలింగ్ చేయటానికి లాస్ట్ డేట్స్ ఎప్పుడు అని ఎలా తెలుసుకోవాలో నేర్చుకుందాం.
Tax Department లో చేస్తున్న Tax Payer/TaxConsultant/Chartered Accountant/Auditor/Accountant ఇలా ఎవరికైనా ఈ ఆర్టికల్ బాగా ఉపయోగపడుతుంది.
Income Tax కు సంబంధించిన Dates ను ఏ ఏ month లో ఏ ఏ ఫైలింగ్స్ ఉన్నాయ్ అనేది ఇప్పుడు చూడబోతున్నాము. దానికోసం Google Chrome లో Income Tax అని search చేయాలి.
కింద చూపిన విధంగా Income Tax Website www.incometax.gov.in ను Open Link in New Tab అని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేయాలి.
Website కింద చూపిన విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో Quick Links Column ను Scroll చేయాలి.
Scroll చేసాక కింద చూపిన విధంగా Tax Calendar మీద క్లిక్ చేయాలి.
కింద చూపిన విధంగా Tax Calendar ఓపెన్ అవుతుంది. ఇక్కడ గమనించండి Please click on Highlighted dates in calendar అని ఉంది కదా అంటే Tax Calendar లో Due Dates అన్ని Highlight చేసి ఉంటాయన్నమాట.
సో మనం ఈజీ గా ఆ Highlighted Date మీద క్లిక్ చేసి చూసుకోవచ్చు. కింద గమనించండి 7th Feb మీద క్లిక్ చేస్తే ఆ particular Date లో ఉన్న Tax Due Dates అన్ని చూపిస్తుంది.
14th Feb మీద క్లిక్ చేస్తే ఆ particular Date లో ఉన్న Tax Due Dates అన్ని చూపిస్తుంది.
అలాగే 15th Feb మీద క్లిక్ చేస్తే ఆ particular Date లో ఉన్న Tax Due Dates అన్ని చూపిస్తుంది.
Next మనం March Month లో ఉన్న Tax Due Dates చూడాలి అనుకుంటే పైన గమనించండి Month దగ్గర ఉన్న Drop Down మీద క్లిక్ చేస్తే మనం చూడాలనుకుంటున్న Month మరియు Year సెలెక్ట్ చేసుకుని చూసుకోవచ్చు. ఉదాహరణకు March Month లో Tax Due Dates చూద్దాం.
కింద గమనించండి March లో 2nd ,7th ,15th ,17th ,31th ఈ Dates Highlight చేసి ఉన్నాయ్ అంటే ఇవి Due Dates. మనం ఆ Highlight చేసిన డేట్ మీద క్లిక్ చేసి కింద చూపిన విధంగా చూసుకోవచ్చు.
అదే విధంగా మనం GST కి సంబంధించిన Dates ను ఏ ఏ month లో ఏ ఏ ఫైలింగ్స్ ఉన్నాయ్ అనేది ఇప్పుడు చూడబోతున్నాము. దానికోసం Google Chrome లో gst.gov.in అని search చేయాలి.
కింద చూపిన విధంగా GST Website gst.gov.in ను Open Link in New Tab అని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేయాలి.
Website ఓపెన్ అయ్యాక ఈ పేజీ ని Scroll డౌన్ చేయాలి.
పైన ఇమేజ్ లో గమనించండి Upcoming Due Dates అని కనిపిస్తుంది కదా .ఇందులో మనం GST కి సంబందించిన Due Dates అన్ని చూడొచ్చు.
పైన ఇమేజ్ లో గమనించండి Upcoming Due Dates పక్కన Download as PDF File అని Link ఉంది కదా ఈ Link మీద క్లిక్ చేసి Download చేసుకుని చూసుకోవచ్చు లేదంటే ఇక్కడే ఐన చూసుకోవచ్చు.చూసారు కదా ఇలా మనం GST మరియు Income Tax Due Dates ను ముందుగానే తెలుసుకోవచ్చు.
ఇప్పుడు మనం Income Tax and GST ఫైలింగ్ చేయటానికి లాస్ట్ డేట్స్ ఎప్పుడు అని ఎలా తెలుసుకోవాలో నేర్చుకున్నాం కదా .
ఇలాంటి TAX కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి.
ఇలాంటి ట్యుటోరియల్స్ ఇంకా కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.