Tally Prime సాఫ్ట్వేర్ లో కస్టమర్ GSTIN ఎలా వెరిఫై చేయాలో మనం ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్ లో మనం Tally Prime సాఫ్ట్వేర్ లో కస్టమర్ HSN కోడ్ ఎలా వ్యాలీడేట్ చేయాలి అని తెలుసుకుందాం. దానికోసం మనం ముందుగా Tally సాఫ్త్వేర్ ని ఓపెన్ చేసుకోవాలి. అప్పుడు క్రింది ఇమేజ్ లో లాగా వస్తుంది.
టర్నోవర్ Below 1.5 crore ఉంటే HSN code మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు.
టర్నోవర్ 1.5 – 5 crore ఉంటే 4 – character HSN code మెయింటైన్ చేయాలి .
above 5 crore టర్నోవర్ ఉంటే 6 – character HSN code మెయింటైన్ చేయాలి .
HSN code లెంగ్త్ డీఫాల్ట్ గా 8- characters ఉంటుంది . ఈ HSN code పర్ఫెక్ట్ గా ఉంటేనే GSTR1 కరెక్ట్ గా ఫైల్ అవుతుంది లేదంటే GSTR 1 GOVT పోర్టల్ లో అప్లోడ్ చేసేటప్పుడు errors చూపిస్తుంది . అందుకే ఈ GSTR 1ఫైల్ చేయడానికి ముందే ఈ ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది . HSN code కరెక్ట్ గా లేకపోతే GSTR 1ఫైల్ అవ్వదు . GSTR 1 ఫైల్ అవ్వకపోతే E-way బిల్ / Invoice జనరేట్ చేయలేము అలాగే ఈ ప్రోడక్ట్ యొక్క information కూడా కరెక్ట్ గా తెలుసుకోలేము . కాబట్టి ఈ HSN code ఎలా వ్యాలీడేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం .
ఈ HSN code వ్యాలీడేట్ చేయాలి అంటే compulsory E-way బిల్ / Invoice యొక్క username & password ఉండాలి .ఈ రెండింటికి కలిపి ఒకటే username & password ఉంటుంది. ఇప్పుడు Gateway of Tally లో Display More Reports మీద క్లిక్ చేయాలి. ( క్రింద ఇమేజ్ లో లాస్ట్ లో Quit అనే ఆప్షన్ కి ముందు Display More Reports అనే ఆప్షన్ ఉంటుంది గమనించండి.)
Display More Reports మీద క్లిక్ చేస్తే ఈ క్రింది ఇమేజ్ లో లాగా వస్తుంది. ఇప్పుడు GST Reports మీద క్లిక్ చేయాలి.
GST Reports మీద క్లిక్ చేస్తే ఈ క్రింది ఇమేజ్ లో లాగా వస్తుంది. ఇప్పుడు GST Rate Setup మీద క్లిక్ చేయాలి.
GST Rate Setup మీద ప్రెస్ చేయగానే మనకి total products అన్ని Display అవుతాయి. ( క్రింది ఇమేజ్ చూడండి)
ఇప్పుడు చూపించింది ఒక method దీనికి shortcut method కూడా ఉంది. ఆ method తెలుసుకోడానికి Gateway of Tally కి రావాలి, సో దానికోసం 2 టైమ్స్ Esc బటన్ ప్రెస్ చేయాలి. అప్పుడు మనం క్రింది ఇమేజ్ లో లాగా Gateway of Tally కి వస్తాము.
Gateway of Tally లో Alt + G ప్రెస్ చేయాలి. Alt + G అంటే Go To కి షార్ట్ కట్ కీ. Alt + G ప్రెస్ చేస్తే క్రింది విధంగా GO TO డైలాగ్ బాక్స్ వస్తుంది.
GO TO డైలాగ్ బాక్స్ లో Rate అని type చేయగానే డ్రాప్ డౌన్ ఆప్షన్స్ లో GST Rate Setup అని వస్తుంది దాన్నిసెలెక్ట్ చేసుకోవాలి. ( క్రింది ఇమేజ్ చూడండి )
Rate Setup సెలెక్ట్ చేయగానే total Items అన్ని Display అవుతాయి ( క్రింది ఇమేజ్ చూడండి ).
ఇలా పైన ఇమేజ్ లో వచ్చిన list of items అన్నిటిని సెలెక్ట్ చేసుకోవాలి . అలా సెలెక్ట్ చేసుకోవాలంటే Ctrl + Space అనే shortcut key ని ఉపయోగించాలి ( క్రింది ఇమేజ్ చూడండి ).
Ctrl + Space బటన్స్ ప్రెస్ చేస్తే స్క్రీన్ రైట్ సైడ్ లో మనం ఉపయోగించాల్సిన key ఆప్షన్స్ వస్తాయి ( క్రింది ఇమేజ్ చూడండి ).
B : Get HSN/SAC Info
R : Move to Group
S : Set Rate
V : Enforce Rate
W : Clear Rate
B : Get HSN/SAC Info అనే ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. “B” కింద సింగల్ లైన్ ఉంటే Alt+B అని “B” కింద డబల్ లైన్ ఉంటే Ctrl +B అని ప్రెస్ చేయాలి, ఇక్కడ B కింద సింగిల్ లైన్ ఉంది కాబట్టి Alt+B ప్రెస్ చేయాలి.
Alt+B అని ప్రెస్ చేసాక “Do you want to get the HSN/SAC details for the selected HSNs/SACs?” అని వస్తుంది ( క్రింది ఇమేజ్ చూడండి ).
పైన ఇమేజ్ లో లాగా మనకు Yes Or No అనే ఆప్షన్స్ ఉంటాయి, మనం Yes ని సెలక్ట్ చేసుకోడానికి “Y” or “ENTER ” ప్రెస్ చేయాలి . అప్పుడు కింద ఇమేజ్ లో లాగా వస్తుంది.
ఇప్పుడు ఇక్కడ మనం ఒకేసారి 474 ఐటమ్స్ ని చెక్ చేస్తున్నాం ( పైన ఇమేజ్ చుడండి ).
ఈ HSN కోడ్ వ్యాలిడేషన్ అనేది సింగల్ ఐటెం creation అప్పుడు లేదా ఐటమ్ alteration అప్పుడు లేదా multiple ఐటమ్స్ కి ఒకేసారి చెక్ చేస్కోవచ్చు. HSN కోడ్ వ్యాలీడేట్ చేయలేకపోతే GSTR1 file correct గా Generate చేయలేము & E-way బిల్ / Invoice కూడా correct గా generate చేయలేము.
ఈ విధంగా మనం Tally Prime సాఫ్ట్వేర్ లో కస్టమర్ HSN కోడ్ ఎలా వ్యాలీడేట్ చేయాలి అని తెలుసుకున్నాం.
ఇలాంటి Tally Prime కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి, Tally Prime సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.
ఇలాంటి ట్యుటోరియల్స్ ఇంకా కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.