TDS / TCS ఆన్లైన్ ద్వారా ఎలా pay చేయాలి అని మనం ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్ లో మనం GSTR 1 నిల్ రిటర్న్స్ ఆన్లైన్ ద్వారా ఎలా చేయాలి అని తెలుసుకుందాం.
GSTR 1 ఫైల్ చేయడానికి ముందుగా GST website లో Login అవ్వాలి. Login అయ్యాక కింద చూపిన విధంగా ఓపెన్ అవుతుంది.
పైన చూపిన విధంగా RETURN DASHBOARD మీద క్లిక్ చేయాలి.
RETURN DASHBOARD మీద క్లిక్ చేసాక కింద చూపిన విధంగా మనం ఏ month యొక్క GSTR 1 ఫైల్ చేయాలి అనుకుంటున్నామో ఆ month సెలెక్ట్ చేసుకోవాలి. కింద గమనించండి డిఫాల్ట్ గా February అని ఉంది ఇక్కడ January సెలెక్ట్ చేసుకుందాం.
January సెలెక్ట్ చేసాక Search Button మీద క్లిక్ చేయాలి.
Search Button మీద క్లిక్ చేసాక మనం GSTR 1 ఫైల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి కింద చూపిన విధంగా GSTR 1 column లో PREPARE ONLINE మీద క్లిక్ చేయాలి.(కింద గమనించండి DUE DATE కూడా చూపిస్తుంది )
PREPARE ONLINE మీద క్లిక్ చేసాక కింద చూపిన విధంగా వస్తుంది.
అంటే ఈ particular కస్టమర్ కి సంబంధించి సేల్స్ ఏమి జరగలేదు కాబట్టి అన్ని Zero గా చూపిస్తుంది(అంటే నిల్ రిటర్న్స్అని అర్ధం). ఇప్పుడు ఈ నిల్ రిటర్న్స్ ని ఫైల్ చేయడానికి File Nill GSTR1 అని CheckBox ( పైన గమనించండి) ఉంది కదా CheckBox మీద క్లిక్ చేయాలి.
CheckBox మీద క్లిక్ చేసాక కింద చూపిన విధంగా FILE STATEMENT మీద క్లిక్ చేయాలి.
FILE STATEMENT మీద క్లిక్ చేసాక కింద చూపిన విధంగా CheckBox మీద క్లిక్ చేయాలి.
CheckBox మీద క్లిక్ చేసాక కింద చూపిన విధంగా Authorised Signatory దగ్గర ఆ particular కస్టమర్ యొక్క Authorised Signature సెలెక్ట్ చేయాలి.
Authorised Signature సెలెక్ట్ చేసాక కింద చూపిన విధంగా FILE WITH EVC మీద క్లిక్ చేయాలి.
FILE WITH EVC మీద క్లిక్ చేసాక ఆ particular కస్టమర్ కి OTP వస్తుంది ఆ OTP ఇక్కడ ఎంటర్ చేసి కింద చూపిన విధంగా Verify మీద క్లిక్ చేయాలి.
Verify మీద క్లిక్ చేసాక GSTR1 ఫైల్ అవుతుంది.
చూసారుగా పైన చూపిన విధంగా GSTR1 ఫైల్ అయినట్టుగా చూపిస్తుంది ఒకసారి చెక్ చేసుకోడానికి DashBoard మీద క్లిక్ చేయాలి.
కింద చూపిన విధంగా FILE RETURNS మీద క్లిక్ చేయాలి.
FILE RETURNS మీద క్లిక్ చేసాక కింద చూపిన విధంగా మనం ఏ month యొక్క GSTR 1 ఫైల్ చేసామో ఆ month సెలెక్ట్ చేసుకుని SEARCH మీద క్లిక్ చేయాలి.
కింద గమనించండి స్టేటస్ దగ్గర Filed అని చూపిస్తుంది కదా అంటే మనం నిల్ రిటర్న్స్ కరెక్టుగా ఫైల్ చేసాం.
ఇప్పుడు మనం GSTR 1 నిల్ రిటర్న్స్ ఆన్లైన్ ద్వారా ఎలా చేయాలి అని తెలుసుకున్నాం కదా .
ఇలాంటి TAX కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి.
ఇలాంటి ట్యుటోరియల్స్ ఇంకా కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.