Tally Prime సాఫ్ట్వేర్ లో All Ledgers Opening Balance జీరో చేయటం ఎలా అని మనం ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్ లో మనం TDS / TCS ఆన్లైన్ ద్వారా ఎలా pay చేయాలి అని తెలుసుకుందాం.
TDS / TCS Challan No. 281 ఆన్లైన్ ద్వారా ఎలా pay చేయాలంటే ముందుగా onlineservices.tin.egovt.nsdl.com Website ను ఓపెన్ చేయాలి.
Website ను ఓపెన్ చేసాక పైన చూపిన విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో TDS / TCS Challan No. 281 అని ఉంది కదా మనం pay చేయాల్సింది ఇదే కాబట్టి ఈ column లో కింద చూపిన విధంగా Proceed మీద క్లిక్ చేయాలి.
Proceed మీద క్లిక్ చేసాక కింద చూపిన విధంగా ఓపెన్ అవుతుంది
Tax Applicable అంటే మనం ఏ person కి ఐతే Deduct చేస్తున్నామో ఆ person యొక్క status (ఈ status ఎలా identify చేయాలి అంటే ఆ particular person యొక్క PAN నెంబర్ లో 4th letter status ను indicate చేస్తుంది.)
ఇక్కడ మనం Indivisual person కి TDS Deduct చేస్తున్నాం కాబట్టి Tax Applicable దగ్గర కింద చూపిన విధంగా (0021)Non -Company Deductees ను సెలెక్ట్ చేయాలి.
Next Type of Payment దగ్గర 2 options ఉన్నాయ్ (200) TDS/TCS Payable by Taxpayer మరియు (400) TDS/TCS Regular Assessment. ప్రతి నెల Tax pay చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కింద చూపిన విధంగా (200) TDS/TCS Payable by Taxpayer ను సెలెక్ట్ చేసుకోవాలి.
Next Nature of Payment (అంటే Nature of Classification మనం ఏ purpose తో Tax Deduct చేస్తున్నాము అని) దగ్గర ఉదాహరణకు మనం ఒక solid person(Private Employee) కి Tax Deduct చేస్తున్నాము కాబట్టి ఇక్కడ కింద చూపిన విధంగా Classification 92B – Payment of Employees other than Govt. Employees ను సెలెక్ట్ చేసుకోవాలి.
Mode of Payment దగ్గర Net Banking సెలెక్ట్ చేసుకుంటే Bank Name సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. Debit Card సెలెక్ట్ చేసుకుంటే card డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ Net Banking సెలెక్ట్ చేసి కింద చూపిన విధంగా Bank Name సెలెక్ట్ చేసుకుందాం.
Tax Deduction Account No అని ఉంది కదా ఇక్కడ ప్రతి ఒక్క Deductor కు ఒక TAN నెంబర్ ఉంటుంది ఇది 10-Digit నెంబర్ (ఇందులో ఫస్ట్ 4 letters Alphabets తర్వాత 5 Numerical తర్వాత ఒక Logical Character Alphabet గా ఉంటుంది). ఈ నెంబర్ ను Copy చేసి Paste చేసుకుందాము .
Next Assessment Year (present year కి Assessment Year అంటే Next Year Financial Year అంటే Current Year ) దగ్గర కింద చూపిన విధంగా Next Year సెలెక్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు Scroll చేసి Remaining Details కూడా కింద చూపిన విధంగా Fill చేయాలి.
పైన ఇమేజ్ లో గమనించండి Details Fill చేసాక Captcha Code ఎంటర్ చేయాలి.
Captcha Code ఎంటర్ చేసాక పైన చూపిన విధంగా Proceed మీద క్లిక్ చేయాలి.
Proceed మీద క్లిక్ చేసాక పైన చూపిన విధంగా Please Confirm Your Information Before Proceeding అని వస్తుంది. Details అన్ని చెక్ చేసుకుని Scroll చేసి కింద చూపిన విధంగా I agree దగ్గర ఉన్న CheckBox మీద క్లిక్ చేసి Submit to the Bank మీద క్లిక్ చేయాలి.
Submit to the Bank మీద క్లిక్ చేసాక కింద చూపిన విధంగా Internet Banking సెలెక్ట్ చేసి Submit మీద క్లిక్ చేయాలి.
Submit మీద క్లిక్ చేసాక కింద చూపిన విధంగా Corporate Banking /YONO Business సెలెక్ట్ చేసి ఆ particular Deductor యొక్క Username మరియు Password ఎంటర్ చేసి Login మీద క్లిక్ చేయాలి.
Login మీద క్లిక్ చేసాక ఆ particular Deductor కి OTP వస్తుంది. ఆ OTP కింద చూపిన విధంగా ఇక్కడ ఎంటర్ చేసి Confirm మీద క్లిక్ చేయాలి.
Confirm మీద క్లిక్ చేసాక చూసారుగా Your Payment was Successful అని వచ్చింది(కింద గమనించండి).
Click here to see the challan details మీద క్లిక్ చేస్తే కింద చూపిన విధంగా Challan ఓపెన్ అవుతుంది. ఈ Challan మనం Print గానీ Download గానీ చేసుకోవచ్చు .
కింద చూపిన విధంగా PDF Format లో Print చేసుకుందాం .
ఇప్పుడు మనం మనం TDS / TCS ఆన్లైన్ ద్వారా ఎలా pay చేయాలి అని తెలుసుకున్నాం కదా .
ఇలాంటి TAX కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి.
ఇలాంటి ట్యుటోరియల్స్ ఇంకా కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.