Tally Prime సాఫ్ట్వేర్ లో మన కస్టమర్స్ / సప్లయర్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ లేకుండా ఉన్నవి ఎలా రిపోర్ట్ తీయాలి అని మనం ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ article లో మనం Tally Prime సాఫ్ట్వేర్ లో All Ledgers Opening Balance జీరో చేయటం ఎలా అని తెలుసుకుందాం.
ఒక Organization /firm లో Auditors దగ్గర balance Sheets అన్ని Audit అయిపోయాక మనం ఫ్రెష్ గా balance ను చేంజ్ చేసుకుందాం అనుకుంటే ఉదాహరణకు Creditor / Debtor యొక్క Opening Balance లో చేంజెస్ వస్తే ఆ Opening Balance ను Remove చేసి ఫ్రెష్ గా స్టార్ట్ చేసుకోడానికి ఈ article బాగా ఉపయోగపడుతుంది.
ఇప్పుడు మనం Tally Prime లో Bulk గా Ledgers Opening Balance ని ఎలా Remove చేయాలో చూద్దాం.దానికోసం Gateway of Tally లో CHart of Accounts ను కింద విధంగా సెలెక్ట్ చేసుకోవాలి.
CHart of Accounts సెలెక్ట్ చేసాక కింద చూపిన విధంగా Text Box లో Ledgers అని ఎంటర్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి.
Ledgers సెలెక్ట్ చేసాక కింద చూపిన విధంగా Right Side లో H: Multi-Masters అని ఉంది కదా H కింద సింగల్ లైన్ ఉంది కాబట్టి Alt +H ప్రెస్ చేయాలి.
Alt +H ప్రెస్ చేసాక కింద చూపిన విధంగా Multi-Masters ఓపెన్ అవుతుంది ఇందులో Multi Alter అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
Multi Alter అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసాక కింద చూపిన విధంగా List of Groups ఓపెన్ అవుతాయి ఇందులో Sundry Debtors ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
Sundry Debtors ఆప్షన్ ను సెలెక్ట్ చేసాక కింద చూపిన విధంగా కర్సర్ opening బాలన్స్ దగ్గరికి వచ్చేవరకు Enter Key ప్రెస్ చేస్తూ ఉండాలి.
కింద చూపిన విధంగా కర్సర్ opening బాలన్స్ దగ్గరికి వచ్చాక Right Side లో B : Zero Opening Balance అని ఉంది కదా B కింద సింగల్ లైన్ ఉంది కాబట్టి Alt +B ప్రెస్ చేయాలి.
Alt +B ప్రెస్ చేసాక కింద చూపిన విధంగా అన్ని ledgers యొక్క Opening Balance Remove అవుతుంది.
చూసారుకదా ఒకే ఒక్క సింగల్ క్లిక్ తో అన్ని ledgers bulk గా ఒకేసారి delete అయిపోయింది. ఇప్పుడు Ctrl +A ప్రెస్ చేసి Gateway of Tally కి Redirect అయ్యే వరకు Esc Button ప్రెస్ చేయాలి.
ఇప్పుడు మనం కరెక్ట్ గా చేసామో లేదో check చేసుకుందాం.దానికోసం Gateway of Tally లో CHart of Accounts ను కింద విధంగా సెలెక్ట్ చేసుకోవాలి.
CHart of Accounts సెలెక్ట్ చేసాక కింద చూపిన విధంగా Text Box లో Ledgers అని ఎంటర్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి.
Ledgers సెలెక్ట్ చేసాక Alt +H(Multi-Masters) ప్రెస్ చేసి కింద చూపిన విధంగా Multi Alter అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. .
Multi Alter అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసాక కింద చూపిన విధంగా List of Groups ఓపెన్ అవుతాయి ఇందులో Sundry Debtors ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
కింద గమనించండి All Ledgers Opening Balance Delete అయి ఉంది కదా అంటే మనం కరెక్టుగానే చేసాం అన్నమాట.
ఇప్పుడు మనం Tally Prime సాఫ్ట్వేర్ లో All Ledgers Opening Balance జీరో చేయటం ఎలా అని తెలుసుకున్నాం కదా .
ఇలాంటి Tally Prime కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి, Tally Prime సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.
ఇలాంటి ట్యుటోరియల్స్ ఇంకా కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.