Sale Invoice / Return Invoices Bulk గా Marg ERP లో ఎలా ప్రింట్ తీసుకోవాలి అని మనం ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్ లో మనం MARG ERP లో Price list ని ఎలా Export చేయాలి అని తెలుసుకుందాం.
స్టాక్ ఐటమ్స్ యొక్క Price list ని మనం PDF మరియు Excel ఫార్మటు లో Export చేసుకోవచ్చు అదెలాగో చూద్దాం.
మెనూ లో Reports > Inventory Report > Rate Lists మీద క్లిక్ చేయాలి.
Rate Lists మీద క్లిక్ చేసాక కింద విధంగా GENERAL PRICE LIST అవుతుంది.
ఇక్కడ Alt +B ప్రెస్ చేయాలి.
Alt +B ప్రెస్ చేసాక పైన చూపిన విధంగా ఆప్షన్స్ వస్తాయి ఇందులో ఆప్షన్ A. PRICE LIST USER DEFINED మీద ప్రెస్ చేయాలి.
ఆప్షన్ A మీద ప్రెస్ చేసాక పైన చూపిన విధంగా PRINT PRICE LIST పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో PRINT COPIES దగ్గర 1 అని ఎంటర్ చేయాలి.
Next Index On దగ్గర క్లిక్ చేస్తే పైన చూపిన విధంగా Dropdown వస్తుంది ఇందులో D. Company +Name ను సెలెక్ట్ చేసుకోవాలి. ఏమైనా చేంజ్ చేయాలి అనుకుంటే Enter Key ప్రెస్ చేస్తూ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేంజ్ చేయడం అయిపోయాక Enter Key ప్రెస్ చేయాలి.
Enter Key ప్రెస్ చేసాక పైన చూపిన విధంగా బటన్స్ చూపిస్తుంది . ఇందులో View బటన్ మీద క్లిక్ చేయాలి.
View బటన్ మీద క్లిక్ చేసాక పైన చూపిన విధంగా price list డీటెయిల్ గా చూపిస్తుంది.
ఈ Price list ని PDF ఫార్మటు లో Export చేసుకోవడానికి పైన చూపిన విధంగా PDF symbol మీద క్లిక్ చేయాలి.
PDF symbol మీద క్లిక్ చేసాక పైన చూపిన విధంగా బటన్స్ చూపిస్తుంది. ఇందులో PDF బటన్ మీద క్లిక్ చేయాలి.
చూసారుకదా ఇలా మనకి Price list Export అవుతుంది.
ఈ Price list ని Excel ఫార్మటు లో Export చేసుకోవడానికి పైన చూపిన విధంగా Excel symbol మీద క్లిక్ చేయాలి.ఇప్పుడు మనం MARG సాఫ్ట్వేర్ లో Price list ని ఎలా Export చేయాలి అని తెలుసుకున్నాం కదా.
ఇలాంటి Marg సాఫ్ట్వేర్ కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి, Marg సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.
ఇలాంటి ట్యుటోరియల్స్ ఇంకా కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.