Marg సాఫ్ట్వేర్ లో ఒక కంపెనీని ఎలా క్రియేట్ చేయాలో ముందు ఆర్టికల్ లో మనం తెలుసుకున్నాము. మార్గ్ సాఫ్ట్వేర్ లో ఐటెమ్ క్రియేషన్ ఎలా చేయాలో మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాము. మరి లేట్ లేకుండా మార్గ్ సాఫ్ట్వేర్ ని మీ సిస్టమ్ లో ఓపెన్ చేసేయండి.
ఐటెమ్ మాస్టర్ క్రియేషన్ చేయాలి అంటే ముందుగా మనం HSN కోడ్ ని క్రియేట్ చేసుకోవాలి. HSN కోడ్ ని క్రియేట్ చేసుకోవడం కోసం Masters లో Inventory Masters లో HSN / SAC Master అనే ఆప్షన్ ని సెలక్ట్ చేసుకోవాలి. ఒకసారి క్రింద ఇమేజ్ చూస్తే మీకు ఈజీగా అర్దం అవుతుంది.
HSN / SAC Master అనే దాని మీద క్లిక్ చేయగానే మనకి క్రింద ఇమేజ్ లో లాగా కనిపిస్తుంది. ఇమేజ్ లో లెఫ్ట్ సైడ్ లో ఉన్న చిన్న డైలాగ్ బాక్స్ లో చూస్తే షార్ట్ కట్ కీస్ ఇన్ఫర్మేషన్ ఇలా ఉంటుంది.
F2-Create New, F3-Modify, Del-Delete : మనం న్యూగా HSN కోడ్ క్రియేట్ చేయాలి అంటే F2 అని ఆల్రెడీ చేసిన దానిలో ఏమైనా చేంజెస్ చేయాలి అంటే F3 అని కోడ్ తప్పుగా ఏమైనా క్రియేట్ చేస్తే డిలీట్ చేయాలి అంటే Del అనే షార్ట్ కట్స్ యూస్ చేయాలి.
Turnover 1.5 to 5 Crore, HSN Code in 2 Character: 1.5 Crore వరకు అంటే కోటిన్నర టర్నోవర్ వరకు HSN కోడ్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. టర్నోవర్ 1.5 కోట్ల నుండి 5 కోట్ల వరకు ఉంటే HSN కోడ్ తప్పనిసరిగా 2 కేరక్టర్స్ అయిన క్రియేట్ చేయాలి.
Turnover > 5 Crore HSN Code in 4 Character : ఒకవేళ టర్నోవర్ 5 కోట్ల కన్నా ఎక్కువ ఉంటే HSN కోడ్ మినిమమ్ 4 కేరక్టర్స్ అయినా ఇవ్వాలి. టోటల్ గా HSN కోడ్ వచ్చేసి 8 క్యారెక్టర్స్ ఉంటుంది.
మనం ఇప్పుడు న్యూ గా HSN కోడ్ క్రియేట్ చేయడం కోసం F2 క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే ఈ క్రింది ఇమేజ్ లో లాగా వస్తుంది.
పైన ఇమేజ్ లో చూస్తే మనకి HSN / SAC detail అనే బాక్స్ కనిపిస్తుంది. అందులో HSN అనేది గూడ్స్ కి యూస్ చేస్తాము, SAC అనేది సర్వీసెస్ కి యూస్ చేస్తాము. మనం ఏ ప్రొడక్ట్ కి HSN కోడ్ క్రియేట్ చేయాలో వాటికి సంబధించిన ఇన్ఫర్మేషన్ అంతా ముందే నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది.
ఇప్పుడు పైన ఇమేజ్ లో DOLO 650 యొక్క HSN కోడ్ 30049069 ని కాపీ చేసుకుని HSN / SAC దగ్గర పేస్ట్ చేసుకోవాలి. DOLO పర్సంటేజ్ 12% కాబట్టి SGST దగ్గర 6, CGST దగ్గర 6, IGST దగ్గర 12%. ఎంటర్ చేయాలి. Type దగ్గర Goods అని UQC దగ్గర PCS అని ఎంటర్ చేయాలి. అంతే మనం ఒక HSN కోడ్ క్రియేట్ చేసేసాము.
UQC అంటే Unique Quantity Code. దీనిని గవర్నమెంట్ వాళ్ళు ముందుగానే డిఫైన్ చేశారు. EX: pieces, boxes, cases. ఇలా అన్నమాట. అంటే మనం ఎంటర్ చేస్తున్న ప్రొడక్ట్ యొక్క మెజర్మెంట్ UQC. ఇవన్నీ ఎంటర్ చేస్తే మనకి క్రింద ఇమేజ్ లో లాగా ఉంటుంది.
Dolo కి ఎలా HSN కోడ్ క్రియేట్ చేశామో అదే ప్రాసెస్ లో నోట్ ప్యాడ్ లో ఉన్న మిగిలిన ఐటెమ్స్ – Vicks-vaporub & TERBINAFORCE PLUS కి కూడా అదే విధంగా కోడ్స్ క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేసుకుంటే క్రింది విధంగా ఉంటుంది.
ఇదే ప్రాసెస్ లో మనం ఏయే ప్రొడక్ట్స్ / ఐటమ్స్ కి HSN క్రియేట్ చేయాలి అనుకున్నామో వాటికి ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. అలా మనం క్రియేట్ చేసుకున్నాక అవన్నీ కూడా ఒక లిస్ట్ లాగా కనిపిస్తాయి క్రింద ఇమేజ్ ని చూడండి.
ప్రస్తుతం మనం 3 HSN కోడ్స్ ని క్రియేట్ చేశాము. ఒకవేళ వాటిలో ఏవైనా మిస్టేక్స్ ఉండి మాడిఫై చేయాలి అనుకుంటే F3 అనే షార్ట్ కట్ కీ ని ప్రెస్ చేసి కావలిసిన మాడిఫికేషన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి HSN కోడ్ ఎలా క్రియేట్ చేయాలో అర్థం అయ్యింది కదా.
ఇప్పుడు ఐటెమ్ మాస్టర్ కు మేజర్ గా ఇంకేం కావాలి HSN కోడ్ కాకుండా అంటే ఐటెమ్ కంపెనీ క్రియేట్ చేయాలి. ఇదంతా కూడా ఒక ఫార్మా డిస్ట్రిబ్యూటర్ ని బేస్ చేసుకుని చేస్తున్నాం అని మనం గుర్తు పెట్టుకోవాలి. ఐటెమ్ కంపెనీ క్రియేట్ చేయాలి అంటే ముందు Esc బటన్ ప్రెస్ చేయాలి.
తరువాత Masters మెనూలో Inventory Master లో Company Master ని సెలక్ట్ చేసుకోవాలి. ( క్రింద ఇమేజ్ ని చూడండి)
Company Master మీద క్లిక్ చేస్తే మనకి క్రింద ఇమేజ్ లో లాగా వస్తుంది.
పైన ఇమేజ్ లో చూస్తే మనకి లెఫ్ట్ సైడ్ లో చిన్న డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది కదా అందులో ఉన్న షార్ట్ కట్ కీస్ ఏమిటంటే, F2 అంటే క్రియేట్ న్యూ, F3 అంటే మాడిఫై, Del అంటే డిలీట్ అని. ప్రెసెంట్ మనకి కావలసింది క్రియేట్ న్యూ కాబట్టి దానిమీద ప్రెస్ చేయాలి. అప్పుడు ఇలా వస్తుంది.
F2 ప్రెస్ చేశాక New Company అని వస్తుంది. మనం అందులో మనకి కావాల్సిన కంపెనీ డీటైల్స్ ని ఇవ్వాల్సి ఉంటుంది. స్టార్టింగ్ లో నోట్ ప్యాడ్ లో Dolo, Vicks-vaporub & TERBINAFORCE PLUS అనే వాటికి సంబంధించిన కంపెనీ డీటైల్స్ కూడా ఉన్నాయి అవి మనం ఇక్కడ అంటే New Company అనే దానిలో ఇస్తాము.
పైన ఇమేజ్ లో మనకు New Company లో Name, Prefrences, Invoice Printing, Dump Days, Expiry Receive Upto అని కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా అవి మనం ఎంటర్ చేయాలి.
డోలో వచ్చేసి MICRO LAB LT వాళ్ళది కాబట్టి ఆ నేమ్ ఇచ్చాము. Dump Days అనేవి డీఫాల్ట్ గా 60 ఉంటుంది, Expiry Receive Upto అనేది డీఫాల్ట్ గా 90 ఉంటుంది. ఈ డేట్స్ అనేవి మనకి కావాల్సినట్లు చేంజ్ చేసుకోవచ్చు. ఒక డిస్ట్రిబ్యూటర్ స్టాక్ ని రిటర్న్ చేయాలి అనుకుంటే కంపెనీకి 3 నెలల ముందే తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళు క్రెడిట్ నోట్ సనేది ఇష్యూ చేయాల్సి ఉంటుంది కాబట్టి Dump Days అనేది 60 ఉండాలి.
మిగిలిన కాలమ్స్ ఏవీ కూడా మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎన్నిసార్లు ఎంటర్ ప్రెస్ చేయాలి అంటే save changes అనే ఆప్షన్ స్క్రీన్ మీద వచ్చేవరకు. ( క్రింద ఇమేజ్ చూడండి)
ఇలా స్క్రీన్ మీద సేవ్ చేంజెస్ అని వచ్చాక ఎంటర్ ప్రెస్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఇదే ప్రాసెస్ లో మనం Vicks-vaporub & TERBINAFORCE PLUS కి కూడా క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేసుకుంటే క్రింద ఇమేజ్ లో లాగా ఉంటాయి.
ఇందాక సేవ్ చేయడం కోసం ఎక్కువ సార్లు ఎంటర్ ప్రెస్ చేశాం కదా అలా కాకుండా డైరెక్ట్ గా సేవ చేయడం కోసం Page Down అనే బటన్ ప్రెస్ చేస్తే save changes అని వస్తుంది అప్పుడు మనం ఎంటర్ ప్రెస్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఇలా మనం ప్రస్తుతం 3 కంపెనీస్ క్రియేట్ చేశాము. ఇప్పడు మనం ఏం చేయాలి అన్నా ప్రెసెంట్ కాలమ్స్ పోయి మామూలుగా మార్గ్ డ్యాష్బోర్డ్ రావాలి. అలా రావాలి అంటే Esc బటన్ ని 2 or 3 టైమ్స్ ప్రెస్ చేయండి. అప్పుడు ఇలా వస్తుంది.
ఇప్పుడు మనం ఐటెమ్ మాస్టర్ ని క్రియేట్ చేయాలి. ఐటెమ్ మాస్టర్ కి సంబంధించిన HSN కోడ్ క్రియేట్ చేశాము, కంపెనీ మాస్టర్ క్రియేట్ చేశాము. ఇప్పుడు ఐటెమ్ మాస్టర్ క్రియేట్ చేయాలి అంటే Masters మెనూలో Inventory Master లో Item Master ని సెలక్ట్ చేసుకోవాలి క్రింద ఇమేజ్ లో లాగా.
ఇలా కాకుండా షార్ట్ కట్ గా క్రియేట్ చేయాలి అంటే Ctrl + I అంటే డైరెక్ట్ గా ఐటెమ్ మాస్టర్ అనేది ఓపెన్ అవుతుంది. ( క్రింద ఇమేజ్ చూడండి)
పైన ఇమేజ్ లో కోడ్ దగ్గర చూస్తే డీఫాల్ట్ గా 1 అని ఉంది. మనం ప్రెసెంట్ కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి 1 అని వుంది నెక్స్ట్ టైమ్ నుండి సీరియల్ వైస్ గా నంబర్స్ ని ఆటోమేటిగ్ ఇస్తుంది.
ITEM – DOLO 650 MG TABLET, PACKING – 15’S, UNIT- PCS లేదా Stri (Strip) అని ఎంటర్ చేయాలి. ఫార్మా రీటైలర్ కు డిస్ట్రిబ్యూటర్ కు తేడా ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ అయితే Packing దగ్గర షీట్స్ లలో ఇవ్వవచ్చు.
DECIMAL దగ్గర ఖచ్చితంగా Yes అనే సెలక్ట్ చేసుకోండి. ఇప్పటి వరకు ఫిల్ చేసిన కాలమ్స్ మనకి ఇలా కనిపిస్తాయి.
నెక్స్ట్ కలర్ ని సెలక్ట్ చేసుకుంటే డ్రాప్ డౌన్ లో Red, Blue, Green, Purple ane కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అక్కడ మనకు నచ్చిన కలర్ ని సెలక్ట్ చేసుకోవాలి. సపోజ్ రెడ్ అనే కలర్ సెలక్ట్ చేస్తే ఐటెమ్ మాస్టర్ ని క్రియేట్ చేశాక Dolo అని టైప్ చేస్తే ఆ లైన్ అంతా రెడ్ కలర్ లో కనిపిస్తుంది.
ఏం కలర్ వద్దు అనుకుంటే Normal అని సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ITEM TYPE దగ్గర Normal, Costly Items, 8 Digree storage అనే ఆప్షన్స్ వస్తాయి. మనం ఎంటర్ చేసే మెడిసన్ ని బేస్ చేసుకుని ఇది సెలక్ట్ చేసుకోవాలి. తరువాత Company దగ్గర డీఫాల్ట్ గా Yes అని ఉంటుంది No అని ప్రెస్ చేస్తే మనం క్రియేట్ చేసిన కంపెనీ లిస్ట్ ఓపెన్ అవుతుంది.
ఈ Dolo 650 అనేది MICRO LAB LT కాబట్టి దాన్ని సెలక్ట్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ SALT దగ్గర కూడా డీఫాల్ట్ గా Yes ఉంటుంది. మనం No ప్రెస్ చేస్తే New salt అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ మనం Dolo టాబ్లెట్ లో ఉండే ఫార్ములా ( paracetamol ) ఏంటో అది ఇవ్వవచ్చు ( క్రింద ఇమేజ్ చూడండి). ప్రెసెంట్ ఏమీ ఇవ్వకూడదు అనుకుంటే Esc ప్రెస్ చేయండి.
నెక్స్ట్ HSN/SAC దగ్గర కూడా డీఫాల్ట్ గా Yes ఉంటుంది. మనం నో అని సెలక్ట్ చేస్తే HSN కోడ్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. అందులో మనం ఎంటర్ చేసిన టాబ్లెట్ కి సంబంధించిన కోడ్ ని సెలక్ట్ చేసుకోవాలి.
LOCAL దగ్గర డీఫాల్ట్ గా Taxable అని ఉంటుంది దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. SGST-6, CGST-6, IGST – 12 అని ఎంటర్ చేసుకోవాలి. అంటే మనం ఎంటర్ చేసిన టాబ్లెట్స్ కి ఉన్న ట్యాక్స్ ఎంతో దానిని ఎంటర్ చేస్తాము ( క్రింద ఇమేజ్ చూడండి). అక్కడ ఉన్న మిగిల ఆప్షన్స్ ఏవీ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం ప్రస్తుతం అయితే లేదు. పర్చేజ్ ఎంట్రీ వేసేటప్పుడు మాత్రమే మిగిలిన కాలమ్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది.
ఇప్పుడు Page Down బటన్ ప్రెస్ చేస్తే సేవ్ చేయాలా వద్దా అని అడుగుతుంది. మనం సేవ్ అని క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. మిగిలిన ప్రొడక్ట్స్ కూడా ఇలాగే మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఎంటర్ చేసుకున్నాక మనకు ఈ విధంగా లిస్ట్ లో కనబడతాయి.
సో ఇలా మనం మార్గ్ సాఫ్ట్వేర్ లో కంపెనీ క్రియేట్ చేశాక, ఐటెమ్ మాస్టర్ ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం.
ఇలాంటి Marg సాఫ్ట్వేర్ కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి, Marg సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.
ఇలాంటి ట్యుటోరియల్స్ ఇంకా కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.