MARG సాఫ్ట్వేర్ లో ఓపెనింగ్ స్టాక్ బాలన్స్ ఎలా ఎంటర్ చేయాలి అని మనం ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్ లో మనం MARG సాఫ్ట్వేర్ లో ఓపెనింగ్ Ledger బాలన్స్ ఎలా ఎంటర్ చేయాలి అని తెలుసుకుందాం.
ఒక కంపెనీలో Debtors మరియు Creditors ను మైంటైన్ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క Outstanding Details డిటైల్డ్ గా రావాలంటే మనం Bill wise Opening Balance ను ఎలా ఎంటర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం దానికోసం ముందుగా మనం ఒక కంపెనీ ని ఓపెన్ చేయాలి.
ఇప్పుడు మెనులో Masters > Opening Balances > Ledger Openings మీద క్లిక్ చేయాలి.
CUSTOMER (SUNDRYDEBTOR ) మీద క్లిక్ చేసాక కింద చూపిన విధంగా ఓపెన్ అవుతుంది.
ఇందులో ఉదాహరణకు ఈ CUSTOMER (SUNDRYDEBTOR) అనే Ledger 01-01-2023 నాటికీ మనకి ఒక 22000/- ఇచ్చేది ఉంది అనుకుందాం. అది కింద చూపిన విధంగా Amount దగ్గర ఎంటర్ చేయాలి. Next Dr అని ఉంది కదా అంటే DEBTOR. Enter Key ప్రెస్ చేయాలి.
Next BILL NO. ,BILL VALUE ,BALANCE కూడా కింద చూపిన విధంగా ఎంటర్ చేయాలి.
ఇలా మనం Bill wise డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు.ఏ Ledger కి అయినా ఇలా Opening Balance ఎంటర్ చేయడం జరుగుతుంది.
ఇప్పుడు ఇలానే పైన చూపిన విధంగా ఇంకొక Bill ను కూడా ఎంటర్ చేసి Save బటన్ మీద క్లిక్ చేయాలి. Save బటన్ మీద క్లిక్ చేసాక ఆటోమేటిక్ గా Ledgers లిస్ట్ కి Redirect అవుతాము. ఇప్పుడు మనం ఓపెనింగ్ Ledger బాలన్స్ ను కరెక్ట్ గా ఎంటర్ చేశామా లేదా అని ఎలా తెలుసుకుందాం దానికోసం మనం Outstandings ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది.అదెలాగో ఇప్పుడు చూద్దాం Esc బటన్ ప్రెస్ చేస్తే Homepage కి Redirect అవుతాము.
ఇప్పుడు మెనులో Books > Outstandings > Party Wise మీద క్లిక్ చేయాలి.
OK బటన్ మీద క్లిక్ చేసాక కింద చూపిన విధంగా మనకి ఆ పర్టికులర్ Ledger(CUSTOMER (SUNDRYDEBTOR)) యొక్క Opening Balance అవుతుంది.
చూసారుకదా ఇలా మనం ప్రతి Ledger యొక్క Opening Balance ను ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక Creditor కి సంబంధించిన Opening Balance ను ఎంటర్ చేద్దాం. Esc బటన్ ప్రెస్ చేస్తే Homepage కి Redirect అవుతాము.
ఇప్పుడు మెనులో Masters > Opening Balances > Ledger Openings మీద క్లిక్ చేయాలి.
Next డిఫాల్ట్ గా Dr అను ఉంది మనం సెలెక్ట్ చేసుకున్న Ledger Creditor కాబట్టి Cr అని సెలెక్ట్ చేసుకోవాలి. Cr అంటే CREDITOR (కంపెనీ చెల్లించాల్సినది ). Enter Key ప్రెస్ చేయాలి.
Enter Key ప్రెస్ చేసాక Opening Outstanding ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం బిల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. కింద చూపిన విధంగా DATE దగ్గర బిల్ Date ఎంటర్ చేయాలి.
ఇప్పుడు ఇలానే పైన చూపిన విధంగా ఇంకొక Bill ను కూడా ఎంటర్ చేసి Save బటన్ మీద క్లిక్ చేయాలి.
Save బటన్ మీద క్లిక్ చేసాక ఆటోమేటిక్ గా Ledgers లిస్ట్ కి Redirect అవుతాము. ఇప్పుడు మనం ఓపెనింగ్ Ledger బాలన్స్ ను కరెక్ట్ గా ఎంటర్ చేశామా లేదా అని ఎలా తెలుసుకుందాం దానికోసం మనం Outstandings ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది.అదెలాగో ఇప్పుడు చూద్దాం Esc బటన్ ప్రెస్ చేస్తే Homepage కి Redirect అవుతాము.
OK బటన్ మీద క్లిక్ చేసాక కింద చూపిన విధంగా మనకి ఆ పర్టికులర్ Ledger(SUPPLIER (SUNDRYCREDITOR) ) యొక్క Opening Balance అవుతుంది.
ఇప్పుడు మనం MARG సాఫ్ట్వేర్ లో ఓపెనింగ్ లెడ్జెర్ బాలన్స్ ఎలా ఎంటర్ చేయాలి అని తెలుసుకున్నాం కదా.
ఇలాంటి Marg సాఫ్ట్వేర్ కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి, Marg సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.
ఇలాంటి ట్యుటోరియల్స్ ఇంకా కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి