MARG ERP లో Price list ని ఎలా Export చేయాలి అని మనం ముందు ఆర్టికల్ లో తెలుసుకున్నాము. ఈ ఆర్టికల్ లో మనం MARG సాఫ్ట్వేర్ లో ఓపెనింగ్ స్టాక్ బాలన్స్ ఎలా ఎంటర్ చేయాలి అని తెలుసుకుందాం.
MARG సాఫ్ట్వేర్ లో ఓపెనింగ్ స్టాక్ బాలన్స్ ను ఎంటర్ చేయడానికి ముందుగా మనం ఒక కంపెనీ ని ఓపెన్ చేయాలి. ఇప్పుడు మెనులో Masters > Opening Balances > Stock Openings మీద క్లిక్ చేయాలి.
Stock Openings మీద క్లిక్ చేసాక కింద చూపిన విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో Selected Company దగ్గర డిఫాల్ట్ గా No అని ఉంటుంది Yes అని సెలెక్ట్ చేసుకోవాలి.
Yes సెలెక్ట్ చేసాక కింద చూపిన విధంగా కంపెనీల లిస్ట్ వస్తుంది ఇక్కడ Control Box లో చూపిన ఆప్షన్స్ ను గమనించండి. ఇక్కడ మనం అన్ని కంపెనీలను సెలెక్ట్ చేయడానికి Shift +* ప్రెస్ చేయాలి.
Shift +* ప్రెస్ చేసాక కింద చూపిన విధంగా ఓపెన్ అవుతుంది Stock as on దగ్గర( Stock /Ledger ఏ opening Balance అయిన ఎంటర్ చేసేటప్పుడు compulsory గా Financial Year యొక్క starting Date ను మాత్రమే ఎంటర్ చేయాలి) Financial Year యొక్క starting Date ను ఎంటర్ చేయాలి.
మనం Batch wise రిపోర్ట్ ఎం తీసుకోవట్లేదు కాబట్టి ఏమి చేంజ్ చెయ్యట్లేదు. నెక్స్ట్ Stock Status దగ్గర కింద చూపిన విధంగా Whole అని సెలెక్ట్ చేసుకోవాలి .
More Options దగ్గర ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే Yes అని సెలెక్ట్ చేసుకుని చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ opening బాలన్స్ ఎంటర్ చేసేటప్పుడు చేంజెస్ చేయాల్సిన అవసరం ఉండదు సో No అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు Accept బటన్ మీద క్లిక్ చేయాలి.
Accept బటన్ మీద క్లిక్ చేసాక కింద చూపిన విధంగా Opening Stock ఓపెన్ అవుతుంది. మనం ఓపెన్ చేసిన ఈ కంపెనీలో 4 ఐటమ్స్ మాత్రమే ఉన్నాయ్ ఇప్పుడు ఈ ఐటమ్స్ యొక్క Opening Balance ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం.
దానికోసం మనం కింద చూపిన విధంగా ఒక ఐటమ్(ఉదాహరణకు DOLO -650MG ) మీద Enter Key ప్రెస్ చేయాలి.
Enter Key ప్రెస్ చేసాక కింద చూపిన విధంగా ఓపెన్ అవుతుంది.
ఇందులో Batch దగ్గర ఉదాహరణకు BATCH -A అని ఎంటర్ చేసుకుందాం.
అలాగే Opening దగ్గర ఎన్ని షీట్స్ ఉన్నాయో ఎంటర్ చేయాలి ఇక్కడ 100 అని ఎంటర్ చేసాము అలాగే M .R .P. , Rate (A ), Rate (B ), Expiry కూడా ఎంటర్ చేయాలి.
అన్ని ఎంటర్ చేసాక కింద చూపిన విధముగా ఓపెన్ అవుతుంది ఇందులో కూడా M .R .P. , PRate(Purchase Rate) ఎంటర్ చేయాలి. ఇలాగె Enter Key ప్రెస్ చేస్తూ అన్ని ఎంటర్ చేయాలి.
అన్ని ఎంటర్ చేసాక Enter Key ప్రెస్చేస్తే కింద చూపిన విధంగా వస్తుంది. అలాగే ఇంకొక Batch కూడా ఎంటర్ చేసుకుందాం BATCH -B.
చూసారుకదా ఇలా మనం ఒక ఐటమ్ కి ఎన్ని బ్యాచ్ లో ఉన్నాయో అవి అన్ని add చేసుకోవచ్చు.
ఇప్పుడు ఐటమ్ కి సంబంధించిన బ్యాచ్ లు అన్ని ఎంటర్ చేసాక ఇది సేవ్ చేయడానికి Tab ప్రెస్ చేయాలి.
Tab ప్రెస్ చేసాక పైన చూపిన విధంగా Yes మీద క్లిక్ చేసి Enter Key ప్రెస్ చేయాలి.కింద ఇమేజ్ లో గమనించండి DOLO -650MG యొక్క OPENING బాలన్స్ add అయింది.
అదే విధంగా మనం ఇంకొక ఐటమ్(ZINCOVIT -200ML -SYRUP ) యొక్క Opening Balance ను ఎంటర్ చేద్దాం. దానికోసం మనం పైన చూపిన విధంగా ZINCOVIT -200ML -SYRUP మీద Enter Key ప్రెస్ చేయాలి.
Enter Key ప్రెస్ చేసాక పైన చూపిన విధంగా ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు ఐటమ్ కి సంబంధించిన బ్యాచ్ లు అన్ని ఎంటర్ చేసాక ఇది సేవ్ చేయడానికి Tab ప్రెస్ చేయాలి.
పైన ఇమేజ్ లో గమనించండి ZINCOVIT -200ML -SYRUP యొక్క OPENING బాలన్స్ add అయింది.
చూసారుకదా ఇలా మనం ప్రతి Stock Item యొక్క opening Balance ను ఎంటర్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మీరు value తో సహా Opening stock రిపోర్ట్ చూడాలి అనుకుంటే Esc బటన్ ప్రెస్ చేయాలి.
Esc బటన్ ప్రెస్ చేసాక MARG సాఫ్ట్వేర్ Home Page కి Redirect అవుతాము ఇక్కడ పైన చూపిన విధంగా మెనులో Stocks > Stock Valuation మీద క్లిక్ చేయాలి.
Stock Valuation మీద క్లిక్ చేసాక పైన చూపిన విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఏమి చేంజెస్ చేయకుండా Accept మీద క్లిక్ చేయాలి.
Accept మీద క్లిక్ చేసాక పైన చూపిన విధంగా Stock Items ను Value తో సహా చూపిస్తుంది . ఇప్పుడు మనం MARG సాఫ్ట్వేర్ లో ఓపెనింగ్ స్టాక్ బాలన్స్ ఎలా ఎంటర్ చేయాలి అని తెలుసుకున్నాం కదా.
ఇలాంటి Marg సాఫ్ట్వేర్ కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి, Marg సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.
ఇలాంటి ట్యుటోరియల్స్ ఇంకా కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి