How to Verify GSTIN in Tally Prime in Telugu

Tally Prime లో ఒక కంపెనీని ఎలా క్రియేట్ చేయాలో మనం ముందు ఆర్టికల్ఈ లో తెలుసుకున్నాము. ఈ  ఆర్టికల్  లో మనం Tally Prime సాఫ్ట్వేర్ లో కస్టమర్ GSTIN ఎలా వెరిఫై చేయాలి అని తెలుసుకుందాం.

Tally Prime సాఫ్ట్వేర్ లో GSTIN ఎందుకు వెరిఫై చేయాలి అంటే మనకున్న Ledger List లో మన Party యొక్క GSTIN number Correct గా ఉందా లేదా దానిలో ఏమైనా Cancel అయ్యాయా లేదా Suspect అయ్యాయా EWB Portal Block లో పెట్టిందా ఇవన్నీ Compulsory చేసుకోవాలి . ఎందుకంటే ఈ రిపోర్ట్ తో Every Month GSTR1  Report  ఫైల్ చేస్తారు  కదా  GSTR1  Report  ఫైల్ చేయడానికంటే ముందే ఈ GSTIN వెరిఫై చేసుకుంటే మనం GSTR1 Report correct గా ఫైల్ చేయగలుగుతాం.

ఈ GSTIN వెరిఫై చేస్కోవడం ద్వారా మనకి ఎవరు Perfect Customer ,Customer Status ,Supplier Status సులభంగా తెలుసుకోవచ్చు .

Gateway of Tally లో Display More Reports Select చేసుకోవాలి .

How to Verify GSTIN in Tally Prime in Telugu 1

Display More Reports Select చేసుకున్నాక  కింద చూపించిన విధంగా GST Reports Select చేసుకోవాలి .

How to Verify GSTIN in Tally Prime in Telugu 2

GST Reports Select చేసుకున్నాక  కింద చూపించిన విధంగా Updated Party GSTIN Select చేసుకోవాలి .

How to Verify GSTIN in Tally Prime in Telugu 3

Updated Party GSTIN select చేసుకున్నాక  Enter >Enter ప్రెస్ చేయాలి.ఇప్పుడు కింద చూపించిన విధంగా List of Ledgers open అవుతుంది అంటే ఇక్కడ  Ledgers List మనం చూడొచ్చు.

How to Verify GSTIN in Tally Prime in Telugu 4

పైన చెప్పిన process కాకుండా దీనికి Shortcut key ఉంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

Esc >Esc >Esc ప్రెస్ చేస్తే  కింద చూపించిన విధంగా Gateway of Tally పేజీ కి వస్తాం.

How to Verify GSTIN in Tally Prime in Telugu 5

ఇప్పుడు  Alt +G ప్రెస్ చేసి Updated Party GSTIN అనే ఆప్షన్ ని కింద చూపించిన విధంగా Type చేసి సెలక్ట్ చేసుకోవాలి.

How to Verify GSTIN in Tally Prime in Telugu 5-1

Updated Party GSTIN Select చేస్కున్న తర్వాత కింద చూపించిన విధంగా GST VALIDATION IN COMPANY అని వస్తుంది . Enter >Enter ప్రెస్ చేయాలి.ఇప్పుడు కింద చూపించిన విధంగా List of Ledgers open అవుతుంది అంటే ఇక్కడ  Ledgers List మనం చూడొచ్చు.

How to Verify GSTIN in Tally Prime in Telugu 4

GSTVALDATION IN COMPANY

Name of Group: All Items

Name of Ledger: All Items

ఇక్కడ All items అని సెలెక్ట్ చేసి Enter key ప్రెస్ చేయాలి.

How to Verify GSTIN in Tally Prime in Telugu 6

ఇక్కడ Right side లో F8:Exception only అని ఉంటుంది  F8 ప్రెస్ చేస్తే  కింద చూపించిన విధం గా  All Party ‘s (Debtor & Creditor )లిస్ట్ కనిపిస్తుంది. ఇందులో all Registration Types of  Party ‘s ఉంటారు.

Registration Types

  • Unknown
  • Composition
  • Consumer
  • Regular
  • Unregistered

ఇక్కడ  కింద చూపించిన విధం గా L: Get GSTIN/UIN Info అని ఉంది కదా L కింద సింగల్ లైన్ ఉంది కాబట్టి Alt +L ప్రెస్ చేయాలి.

How to Verify GSTIN in Tally Prime in Telugu 7

Alt +L ప్రెస్ చేసాక కింద చూపిన విధంగా Dialogue Box open అవుతుంది

A :Get GSTINUIN Info for all GSTINSUINs

C: Get GSTINIUIN Info for current GSTINUIN

How to Verify GSTIN in Tally Prime in Telugu 8

ఈ Dialogue Box లో option ” A :Get GSTINUIN Info for all GSTINSUINs ” Select చేసి Enter కీ ప్రెస్ చేయాలి.అప్పుడు కింద చూపిన విధంగా ఇంకొక Dialogue Box వస్తుంది .

One or more of the selected GSTINs/UINs are Incorect /Invalid.

Do you want to get the information only for the correct GSTINs/ UINS?

అంటే మీరు ఈ Party ‘s యొక్క Information  చూడాలి అనుకుంటున్నారా అని అడుగుతుంది ఇక్కడ Yes మీద క్లిక్ చేయాలి.

How to Verify GSTIN in Tally Prime in Telugu 9

మనం Yes సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి Total Party ‘s యొక్క GSTINs/UINs  Validation check చేస్తుంది. కింద చూడండి Total 128 Party ‘s ఉన్నారు.అవన్నీ మనం GSTINs/UINs Validation check చేస్తున్నాం.

How to Verify GSTIN in Tally Prime in Telugu 10

మనం GSTINs/UINs Validation check చేసాక మనకి కింద చూపిన విధంగా Exchange Summary వచ్చింది.

How to Verify GSTIN in Tally Prime in Telugu 11

Exchange Summary                       Count

Information received successfully      126

Information not found                           2

ఈ Exchange Summaryఏంటి అంటే మనం Validate చేసిన 128 Party ‘sలో 126 Party ‘s యొక్క  ఇన్ఫర్మేషన్ Successful అంటే కరెక్టుగా ఉంది. Remaining 2 Party ‘s Information కరెక్టుగా లేదు అని వచ్చింది.

Dialogue Box లో   Press any key to continue అని ఉంది కదా Enter కీ ప్రెస్ చేయాలి.

ఇక్కడ కింద చూపిన విధంగా Right side లో B: Basis of Values అని option ఉంది కదా .B కింద 2 లైన్స్ ఉన్నాయ్ కాబట్టి Ctrl button ఉపయోగించాలి .

How to Verify GSTIN in Tally Prime in Telugu 12

Ctrl+B ప్రెస్ చేయాలి. కింద చూపిన విధంగా List Of Configurations లో Status : Any  అని వచ్చింది కదా Enter  ప్రెస్ చేయాలి.

How to Verify GSTIN in Tally Prime in Telugu 13

Enter ప్రెస్ చేస్తే List అఫ్ Statuses అని Drop Down వస్తుంది.

List of Statuses

  • Active GSTIN/UIN
  • EWB Blocked
  • Inactive GSTIN/UIN
  • Info Not Found
  • Not Sent
  • Request Failed

How to Verify GSTIN in Tally Prime in Telugu 14

Active GSTIN/UIN:  GSTIN/UIN పర్ఫెక్ట్ గ ఉన్న Party ‘s లిస్ట్ వస్తుంది.

EWB Blocked: EWB Portal Block చేసిన GSTIN  Party ‘s లిస్ట్ వస్తుంది.

Inactive GSTIN/UIN: Cancel ఐన GSTIN Party ‘s లిస్ట్ వస్తుంది.

Info Not Found: GSTIN పోర్టల్ లో Info Not Found అని వచ్చిన Party ‘s లిస్ట్ వస్తుంది.

పైన చూపించిన విధంగా First “Active GSTIN/UIN ” సెలెక్ట్ చేసుకుందాం.  “Active GSTIN/UIN ” సెలెక్ట్ చేసి Ctrl +A  ప్రెస్ చేయాలి. కింద  చూపించిన విధంగా GSTIN/UIN పర్ఫెక్ట్ గా  ఉన్న Party ‘s లిస్ట్ వస్తుంది.

How to Verify GSTIN in Tally Prime in Telugu 15

ఇక్కడ Example గా మనం ఒక Party Details చూద్దాం .కింద చూపించిన విధంగా

Enter >Yes >Enter ప్రెస్ చేయాలి

How to Verify GSTIN in Tally Prime in Telugu 16

Enter ప్రెస్ చేస్తే ఇక్కడ మనం GSTIN/UIN perfect గా ఉందొ లేదో చూడొచ్చు .కింద  చూపించిన విధంగా ఈ blue colour బాక్స్ ఏంటంటే Party యొక్క Govt.Portal Information .

ఇక్కడ చూడండి

Registration  Type : REG(Regular )

Status : Active

EWB Block Status :Unblocked

ఇలా ఉంది కదా అంటే Party GSTIN/UIN perfect గా ఉంది అని.

How to Verify GSTIN in Tally Prime in Telugu 17

Esc >Esc >Esc ప్రెస్ చేసి ఇప్పుడు Ctrl +B ప్రెస్ చేయాలి.Ctrl +B ప్రెస్ చేసి Enter కీ ప్రెస్ చేస్తే   List అఫ్ Statuses అని Drop Down వస్తుంది  కింద చూపించిన విధంగా Status “EWB Blocked” సెలెక్ట్ చేసుకుందాం.

How to Verify GSTIN in Tally Prime in Telugu 18

status “EWB Blocked” అంటే EWB Portal లో ఏఏ Party ‘s ని Block చేసారో ఇక్కడ మనం చూడొచ్చు.ఇక్కడ Ctrl +A ప్రెస్ చేయాలి ఇప్పుడు కింద చూపించిన విధంగా GSTIN /UIN  red colour లో చూపిస్తుంది అంటే ఈ Party ‘s Block చేయబడ్డాయి . ఆ Details  ఎలా చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు  Enter కీ ప్రెస్ చేసి Yes చేస్కుని  Enter కీ ప్రెస్ చేయాలి.

How to Verify GSTIN in Tally Prime in Telugu 19

Blocked Party Details మనం ఇక్కడ చూడొచ్చు.

ఇక్కడ చూడండి

Registration  Type : REG(Regular )

Status : Active

EWB Block Status : Blocked  అంటే ఈ Party ని EWB Portal లో Block చేసారు.

How to Verify GSTIN in Tally Prime in Telugu 20

Esc >Esc >Esc ప్రెస్ చేసి ఇప్పుడు Ctrl +B ప్రెస్ చేయాలి.Ctrl +B ప్రెస్ చేసి Enter కీ ప్రెస్ చేస్తే   List అఫ్ Statuses అని Drop Down వస్తుంది  కింద చూపించిన విధంగా Status “Inactive GSTIN /UIN” సెలెక్ట్ చేసుకుందాం.

How to Verify GSTIN in Tally Prime in Telugu 21

status “Inactive GSTIN /UIN” సెలెక్ట్ చేసాక Inactive Party ‘s ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ చూపిస్తుంది.

How to Verify GSTIN in Tally Prime in Telugu 22

పైన చూపించిన ఆ 2 Party ‘s యొక్క GSTIN /UIN Registration Cancel అయిపోయాయి.ఆ Details ఇప్పుడు చూద్దాం Ctrl+A ప్రెస్ చేసి ‘Yes  ‘ అని Select చేస్కుని  Enter key ప్రెస్ చేస్తే Details ఈ కింద చూపిన విధంగా వస్తాయి.

ఇక్కడ చుడండి

Registration  Type : REG(Regular )

Status :Cancelled

EWB Block Status : Unblocked అంటే ఆ Particular Party యొక్క GSTIN /UINచేసుకున్నారు కాకపోతే మనకి Inform చేయలేదు.

How to Verify GSTIN in Tally Prime in Telugu 23

Esc >Esc >Esc ప్రెస్ చేసి ఇప్పుడు Ctrl +B ప్రెస్ చేయాలి.Ctrl +B ప్రెస్ చేసి Enter కీ ప్రెస్ చేస్తే   List అఫ్ Statuses అని Drop Down వస్తుంది  కింద చూపించిన విధంగా Status “Info Not Found” సెలెక్ట్ చేసుకుందాం.

How to Verify GSTIN in Tally Prime in Telugu 24

కింద చూపించిన ఆ 2 Party ‘s యొక్క GSTIN /UIN  number mistake ఉంది ఇప్పుడు  Enter key ప్రెస్ చేస్తే Details ఈ కింద చూపిన విధంగా వస్తాయి.

ఇక్కడ చూడండి

Warning

The GSTIN /UIN  number is Invalid or contains special characters

Enter The GSTIN /UIN  number manually and try again

అంటే GSTIN /UIN  number లో mistake ఉంది అందుకే  చెక్ చేసుకుని manual గా enter చేసి Validation చేసుకోవాలి.

How to Verify GSTIN in Tally Prime in Telugu 25

Esc >Esc >Esc ప్రెస్ చేసి ఇప్పుడు Ctrl +B ప్రెస్ చేయాలి.Ctrl +B ప్రెస్ చేసి Enter కీ ప్రెస్ చేస్తే   List అఫ్ Statuses అని Drop Down వస్తుంది  కింద చూపించిన విధంగా Status ” Not sent ” సెలెక్ట్ చేసుకుందాం.

How to Verify GSTIN in Tally Prime in Telugu 26

Status ” Not sent ” సెలెక్ట్ చేస్తే మొత్తం Unregistered  Dealers List వస్తుంది.ఇది మనకి అవసరం లేదు.

Every Month GSTR1  Report  ఫైల్ చేసుకోవాలి కాబట్టి   GSTR1  Report  ఫైల్ చేయడానికంటే ముందే ఈ GSTIN వెరిఫై చేసుకుంటే మనం GSTR1 Report correct గా ఫైల్ చేయగలుగుతాం.

ఈ విధంగా  మనం Tally Prime సాఫ్ట్వేర్ లో కస్టమర్ GSTIN ఎలా వెరిఫై చేయాలి అని తెలుసుకున్నాం  కదా .

ఇలాంటి Tally Prime కి సంబంధించిన మరెన్నో టాపిక్స్ మీద ముందు ముందు అనేక ఆర్టికల్స్ పబ్లిష్ కాబోతున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి,  Tally Prime సాఫ్ట్వేర్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోండి.

ఇలాంటి  ట్యుటోరియల్స్ ఇంకా  కావాలి అనుకుంటే మాకు మీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ పోస్ట్ ని అదే విధంగా, మా వీడియోస్ ని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top